Dussehra Holidays: సెలవులకు ఊరెళ్తున్నారా.. ముందుగా ఇది తెలుసుకోండి..
ABN , Publish Date - Oct 03 , 2024 | 12:18 PM
Dussehra Holidays: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించింది. దీంతో పిల్లలతో సహా.. పలు కుటుంబాలు దసరా సెలవులకు తమ తమ సొంతూళ్లకు, బంధుమిత్రుల ఊళ్లకు పయనమవుతున్నారు. ప్రజలంతా దసరా సెలవులను ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేస్తుంటే.. మరోవైపు కేటుగాళ్లు తమకు అనువైన సమయం రానే వచ్చిందంటూ..
Dussehra Holidays: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించింది. దీంతో పిల్లలతో సహా.. పలు కుటుంబాలు దసరా సెలవులకు తమ తమ సొంతూళ్లకు, బంధుమిత్రుల ఊళ్లకు పయనమవుతున్నారు. ప్రజలంతా దసరా సెలవులను ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేస్తుంటే.. మరోవైపు కేటుగాళ్లు తమకు అనువైన సమయం రానే వచ్చిందంటూ సిద్ధమవుతున్నారు. అవును, ఊళ్లకు వెళ్లే వారి ఇళ్లే టార్గెట్‌గా దొంగలు దోపిడీకి పాల్పడే అవకాశం ఉంది. తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా దోపిడీలు జరిగే అవకాశం ఉంది. అందుకే ఊళ్ల ప్రయాణాలు సాగించే వారిని ఉద్దేశించి తెలంగాణ పోలీసులు కీలక ప్రకటన జారీ చేశారు. దసరా సెలవుల్లో ఊళ్లకు వెళ్లే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇళ్లకు తాళం వేసి ఊళ్లకు వెళ్లేవారు తమ ఇంట్లో చోరీ జరుగకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు, బంగారం దొంగలపాలవకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, దొంగతనాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రజలకు పోలీసులు చెబుతున్నారు. ఆ సూచనలివే..
1.డబ్బు, విలువైన ఆభరణాలు ఇంట్లో ఉంచి వెళ్ళకూడదు.
2. రాత్రివేళ అనుమానాస్పదంగా సంచరించేవారి గురించి పోలీసులకు వెంటనే సమాచారం అందించాలి.
3. తాళం వేసిన ఇళ్లను అపరిచిత వ్యక్తులు ఉదయం వేళ వెతికినట్లు కనిపిస్తే అప్రమత్తం కావాలి.
4. విలువైన వస్తువులను పక్కింటి వారికి ఇచ్చి నమ్మి మోసపోవద్దు. ఇరుగు పొరుగు వారిని తమ ఇంటిని కనిపెట్టి ఉండమని చెప్పి వెళ్లడం మంచిది.
5. వీలైనంత త్వరగా ప్రయాణం ముగించుకుని వచ్చేలా చూసుకోవాలన్నారు.
6. పక్కింటి వారి ద్వారా ఇంటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి.
7. ఇంట్లో కుటుంబ సభ్యులు బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్న మహిళలు, వృద్దుల వద్దకు అపరిచితులు సమాచారం కావాలంటూ వస్తే నమ్మవద్దు. వారిపట్ల ఏమరుపాటుగా ఉండవద్దు.
8. ఖరీదైన వస్తువులను బ్యాంక్ లాకర్‌లో పెట్టుకోవాలి.
9. CCTV కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.
10. కొత్తవారి కదలికలపై, అనుమానితుల సమాచారం పోలీసులకు అందించి దొంగతనాల నివారణకు సహకరించాలి.
11. చుట్టు పక్కల వారి సెల్‌ఫోన్ నంబర్లు దగ్గర ఉంచుకోవాలి.
12. బయటికేల్లేటప్పుడు తాళలను ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
13. గ్రామాలకు వెళ్లే వారు ఇంట్లో ఏదో ఒక గదిలో లైటు వేసి ఉంచాలి.
సైబర్ మోసాలపై అలర్ట్..
దసరా పండుగ సందర్భంగా ఈ కామర్స్ కంపెనీలు మంచి మంచి ఆఫర్లను ఇచ్చి కస్టమర్లను ఆకట్టుకుంటాయి. అయితే, ఇదే అదునుగా భావించి సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతుంటారు. ప్రజలను మోసం చేస్తుంటారు. అందుకే ఆన్‌లైన్ షాపింగ్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లేదంటే భారీగా డబ్బులు పోగొట్టుకోవాల్సి వస్తుంది. తెలియని వ్యక్తులు, సంస్థల నుంచి వచ్చే మెసేజ్‌లు, లింక్స్‌పై క్లిక్ చేయొద్దు. లాటరీ తగిలిందని, ఏదో గిఫ్ట్ వచ్చిందని, కారు వచ్చిందని, బైక్ వచ్చిందని, డబ్బులు గెలుచుకున్నారని చెప్పి నమ్మిస్తారు. అలాంటి మాయ మాటలను అస్సలు నమ్మొద్దు. సైబర్ మోసానికి గురైతే.. వెంటనే 1930కి కాల్ చేసి సమాచారం అందించాలి. లేదంటే సమీపంలోని పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేయాలి.
Also Read:
తొలిరోజు అమ్మవారి రూపాలు ఇవే..
కూటమి ప్రభుత్వంపై ఎంపీ అవినాష్ రెడ్డి కామెంట్స్
For More Telangana News and Telugu News..