TG Police: బంగ్లాదేశ్ పరిణామాలపై తెలంగాణ పోలీస్‌శాఖ అలర్ట్
ABN , Publish Date - Aug 10 , 2024 | 10:47 AM
Telangana: బంగ్లాదేశ్ పరిణామాలపై తెలంగాణ పోలీస్ శాఖ అలర్ట్ అయ్యింది. బంగ్లాదేశ్ ఉద్రిక్తత పరిస్థితులపై హైదరాబాద్‌లో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో ఉన్న బంగ్లాదేశీయులపై కూడా నిఘా పెట్టారు. హైదరాబాద్‌కు అక్రమంగా వస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.
హైదరాబాద్, ఆగస్టు 10: బంగ్లాదేశ్ పరిణామాలపై తెలంగాణ పోలీస్ శాఖ (Telangana Police) అలర్ట్ అయ్యింది. బంగ్లాదేశ్ ఉద్రిక్తత పరిస్థితులపై హైదరాబాద్‌లో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో ఉన్న బంగ్లాదేశీయులపై కూడా నిఘా పెట్టారు. హైదరాబాద్‌కు అక్రమంగా వస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. బాలాపూర్ లిమిట్స్‌లో 5000 మందికిపైగా రోహింగ్యాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
Alla Nani: ఆళ్ల నాని రాజీనామా వెనుక ఏం జరిగింది.. వాట్ నెక్స్ట్!?
కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో వారికి గుర్తింపు కార్డులు వచ్చాయని సీపీ సుదీర్ బాబు తెలిపారు. ఇతర దేశాల నుండి వచ్చే వారిపై ఎప్పటికప్పుడు నిఘా ఉంటుందని పోలీసులు తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో నివసిస్తున్న రోహింగ్యాలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంటుందని సీపీ సుదీర్ బాబు వెల్లడించారు.
Viral Video: తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండుంటే ఇలా జరిగేది కాదేమో.. పిల్లలు లిఫ్ట్ ఆట ఆడుతుండగా..
మరోవైపు బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై తెలంగాణా డీజీపీ జితేందర్ (Telangana DGP Jitender) స్పందించారు. బంగ్లాదేశ్ ఉద్రిక్తత పరిస్థితులపై హైదరాబాద్‌లో కూడా నిఘా పెట్టామన్నారు. హైదరాబాద్‌లో ఉన్న బంగ్లాదేశీయులపై నిఘా ఉంచామని... అయినా హైదరాబాద్‌కు అక్రమంగా వస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఎలాంటి పరిణామాలనైన ఎదుర్కొనేందుకు తెలంగాణ పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
Hyderabad: మ్యాట్రిమోనీ సైట్‌లో అమ్మాయిల నకిలీ వివరాలతో మోసం..
Viral Video: గంటకు 800కి.మీ వేగంతో దూసుకెళ్లే విమానం.. పైనుంచి చూడగా గుండె ఆగిపోయే సీన్..
Read Latest Telangana News And Telugu News