Share News

రాష్ట్రానికి రూ.1,453 కోట్లు

ABN , Publish Date - Nov 23 , 2024 | 05:01 AM

కేంద్ర గ్రాంట్లు, కాంట్రిబ్యూషన్ల కింద రాష్ట్ర ప్రభుత్వానికి మరిన్ని నిధులు అందాయి. ఈ పద్దు కింద అక్టోబరులో రూ.1,452.71 కోట్లు వచ్చాయి. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.3,899.74 కోట్లు వచ్చినట్లయింది.

రాష్ట్రానికి రూ.1,453 కోట్లు

  • అక్టోబరులో కేంద్ర గ్రాంట్ల కింద రాక

  • ఈ ఆర్థిక సంవత్సరం వచ్చింది రూ.3,899.74 కోట్లే

  • అన్ని రాబడుల కింద రూ.1,25,989 కోట్ల రాక

  • బహిరంగ మార్కెట్‌ అప్పులు రూ.35,120 కోట్లు

  • అక్టోబరు నాటికి రాష్ట్ర ప్రభుత్వ వ్యయం రూ.1,23,799 కోట్లు.. కాగ్‌ అక్టోబరు నివేదిక

హైదరాబాద్‌, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): కేంద్ర గ్రాంట్లు, కాంట్రిబ్యూషన్ల కింద రాష్ట్ర ప్రభుత్వానికి మరిన్ని నిధులు అందాయి. ఈ పద్దు కింద అక్టోబరులో రూ.1,452.71 కోట్లు వచ్చాయి. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.3,899.74 కోట్లు వచ్చినట్లయింది. కేంద్ర గ్రాంట్లు, కాంట్రిబ్యూషన్ల కింద ఈసారి రూ.21,636.15 కోట్లు వస్తాయని అంచనా వేయగా... అక్టోబరునాటికి రూ.3,899.74 కోట్లు (18.02ు) వచ్చాయి. ఈమేరకు కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) శుక్రవారం రాష్ట్ర ఆదాయ, వ్యయాలపై అక్టోబరు నివేదికను విడుదల చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) మొదటి మూడు నెలల్లో (ఏప్రిల్‌, మే, జూన్‌) కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎలాంటి గ్రాంట్లు, కాంట్రిబ్యూషన్లను విడుదల చేయలేదు. అయితే జూలైలో రూ.1,880.18 కోట్లు, ఆగస్టులో రూ.566.85 కోట్లు విడుదల చేసింది. సెప్టెంబరులో నయా పైసా ఇవ్వలేదు. అక్టోబరులో రూ.1,452.71 కోట్లు విడుదల చేసింది. ఇక అన్ని రకాల రాబడుల కింద అక్టోబరునాటికి రూ.1,25,989.74 కోట్లు వచ్చాయి. ఈసారి బడ్జెట్‌లో అన్ని రకాల రాబడుల కింద రూ.2,74,057.64 కోట్లు అంచనా వేయగా... 45.97 శాతం నిధులు సమకూరాయి. ఇందులో రెవెన్యూ రాబడుల కింద రూ.2,21,242.23 కోట్లు అంచనా వేయగా... రూ.90,844.45 కోట్లు(41.06ు), మూలధన రాబడుల కింద రూ.52,815.41 కోట్లు అంచనా వేయగా... రూ.35,145.29 కోట్లు(66.54ు) సమకూరాయి.


మూలధన రాబడుల్లో కేవలం బహిరంగ మార్కెట్‌ అప్పుల కిందే రూ.35,120.91 కోట్లు వచ్చాయి. మొత్తం రూ.49,255.41 కోట్ల మేర అప్పులు తీసుకుంటామని ప్రభుత్వం అంచనా వేయగా... అక్టోబరునాటికి 71.30 శాతం మేర అప్పులు సేకరించింది. రెవెన్యూ రాబడుల్లో పన్నుల కింద అంచనా వేసిన రూ.1,64,397.64 కోట్లకుగాను రూ.82,135.38 కోట్లు, పన్నేతర రాబడి కింద రూ.35,208.44 కోట్లకుగాను రూ.4809.33 కోట్లు వచ్చాయి. వస్తు సేవల పన్ను(జీఎస్టీ) కింద రూ.58,594.91 కోట్లకుగాను రూ.29,526.14(50.39ు) కోట్లు, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల కింద రూ.18,228.82 కోట్లకుగాను రూ.8,359.87 కోట్లు(45.86ు), అమ్మకం పన్ను కింద రూ.33,449.21 కోట్లకుగాను రూ.18,595.66(55.59ు) కోట్లు, రాష్ట్ర ఎక్సైజ్‌ సుంకాల కింద రూ.25,617.53 కోట్లకుగాను రూ.10,921.88 కోట్లు(42.63ు), కేంద్ర పన్నుల్లో వాటా కింద రూ.18,384.19 కోట్లకుగాను రూ.10,159.63 కోట్లు(55.26ు), ఇతర పన్నుల కింద రూ.10,111.78 కోట్లకుగాను రూ.4571.52 కోట్లు(45.21ు) వచ్చాయి. అక్టోబరు నాటికి అన్ని రకాల వ్యయాల కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.1,23,799.29 కోట్లు ఖర్చు చేసింది. మొత్తం అంచనా వ్యయం రూ.2,54,431.31 కోట్లలో ఇది 48.66 శాతం. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల కోసం రూ.47,994.81 కోట్లు, వడ్డీ చెల్లింపుల కోసం రూ.15,152.63 కోట్లు, ఉద్యోగుల జీతభత్యాల కోసం రూ.25,141.39 కోట్లు, పెన్షనర్ల పెన్షన్లకు రూ.10,069.45 కోట్లు, సబ్సిడీల కోసం రూ.7,690.12 కోట్లు ఖర్చు చేసింది.

Updated Date - Nov 23 , 2024 | 05:01 AM