Telangana Shakatam: సీఎం రేవంత్ చొరవతో చివరి నిమిషంలో రిపబ్లిక్‌డే కవాతుకు తెలంగాణ శకటం ఎంట్రీ
ABN , Publish Date - Jan 05 , 2024 | 10:46 AM
Telangana: 2024 గణతంత్ర దినోత్సవ కవాతుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర శకటాలు ఎంపికయ్యాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో చివరి నిమిషంలో తెలంగాణ శకటం ఎంట్రీ సాధించింది. మదర్ ఆఫ్ డెమోక్రసీ పేరిట ఈ ఏడాది తెలంగాణ శకటం ఆకట్టుకోనుంది. చిట్యాల(చాకలి) ఐలమ్మ, కుమరం భీం జీవితాల థీమ్‌కు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది.
న్యూఢిల్లీ, జనవరి 4: 2024 గణతంత్ర దినోత్సవ (Republic day Celebrations) కవాతుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర శకటాలు ఎంపికయ్యాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) చొరవతో చివరి నిమిషంలో తెలంగాణ శకటం ఎంట్రీ సాధించింది. మదర్ ఆఫ్ డెమోక్రసీ పేరిట ఈ ఏడాది తెలంగాణ శకటం ఆకట్టుకోనుంది. చిట్యాల(చాకలి) ఐలమ్మ, కుమరం భీం జీవితాల థీమ్‌కు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది.
తెలంగాణలో ప్రత్యేక గుర్తింపు పొందిన రాంజీ గోండ్, కుమురం భీం, చిట్యాల (చాకలి) ఐలమ్మల జీవితాలను, ప్రజాస్వామిక తిరుగుబాటుకు థీమ్‌లకు చోటు దక్కింది. ఈసారి జనవరి 26న కర్తవ్యపథ్‌లో తెలంగాణ శకటం సందడి చేయనుంది. తెలంగాణ శకటం ప్రదర్శనకు వచ్చే సమయంలో దానికి ఇరువైపులా రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా కొమ్ముకోయ, గుస్సాడి, డప్పుల నృత్యాల కళాకారుల ప్రదర్శన ఉండే అవకాశం ఉంది.
కాగా... తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో 2015 సంవత్సరంలో ఒకసారి, 2020 రిపబ్లిక్ డే రోజున మరోసారి తెలంగాణ శకటం కనువిందు చేయగా నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తెలంగాణ శకటానికి అవకాశం లభించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..