Weather Alert: నేడు, రేపు అక్కడక్కడ వర్షాలు
ABN , Publish Date - Dec 01 , 2024 | 04:13 AM
ఫెంగల్ తుఫాన్ కారణంగా తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఆది, సోమవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
హైదరాబాద్, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఫెంగల్ తుఫాన్ కారణంగా తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఆది, సోమవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు శనివారం నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, యాదాద్రి, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా, రాష్ట్రంలో చలి కాస్త తగ్గింది. గత వారం రోజులుగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు తగ్గి, చలి తీవ్రత పెరుగుతుండగా శుక్రవారం రాత్రి మాత్రం ఏకంగా ఐదారు డిగ్రీల మేరకు ఉష్ణోగ్రతలు పెరిగాయి.