Tummala: పత్తి కొనుగోళ్లలో దేశంలోనే తెలంగాణ నెం.1
ABN , Publish Date - Nov 23 , 2024 | 04:51 AM
పత్తి కొనుగోళ్లలో ఈ సంవత్సరం దేశంలోనే తెలంగాణ నెం.1 స్థానంలో కొనసాగుతోందని, రైతులకు ఇబ్బంది కలగకుండా గత ఏడాది కంటే ఎక్కువగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
ప్రతిపక్షాలవి అర్థంలేని విమర్శలు: తుమ్మల
‘ధరణి’ పేరిట భూములు గుంజుకున్నారు: సీతక్క
మరో పదేళ్లు కాంగ్రె్‌సదే అధికారం: మంత్రి కోమటిరెడ్డి
నల్లగొండ/యాదగిరిగుట్ట రూరల్/హైదరాబాద్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): పత్తి కొనుగోళ్లలో ఈ సంవత్సరం దేశంలోనే తెలంగాణ నెం.1 స్థానంలో కొనసాగుతోందని, రైతులకు ఇబ్బంది కలగకుండా గత ఏడాది కంటే ఎక్కువగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం నల్లగొండ జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం(దిశ)లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీలు రఘువీర్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డితో కలిసి పాల్గొన్న ఆయన మాట్లాడారు. ఈ సంవత్సరం అత్యఽధికంగా ఽధాన్యం, పత్తి ఉత్పత్తులు వచ్చినా రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కొనుగోళ్లు చేస్తున్నామని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లలోనూ గత ఏడాది 141లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం కొంటే, ఈసారి 153లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, రైతులకు వెంట వెంటనే బిల్లులు కూడా అందిస్తున్నామని పేర్కొన్నారు.
కాగా, రాష్ట్రంలో 11 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు కొత్తగా పాలకవర్గాలు నియమించినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. మరోవైపు.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూములను ‘ధరణి’ పేరిట బీఆర్‌ఎస్ నాయకులు గుంజుకున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో రూ.210 కోట్లతో చేపట్టనున్న మిషన్ భగీరఽథ పైలాన్ నిర్మాణానికి మంత్రులు తుమ్మల, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఆమె శంకుస్థాపన చేశారు. మిషన్ భగీరథ పనులు పూర్తయితే భువనగిరి, ఆలేరు, జనగాం నియోజకవర్గాలోని 523 గ్రామాలకు తాగునీరు అందుతుందన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మరో పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని, ఎమ్మెల్యేలు ఎప్పుడూ ప్రజల మధ్య ఉండాలని సూచించారు.