Share News

Cold Wave: రాష్ట్రంపై ‘చలి పంజా’

ABN , Publish Date - Dec 15 , 2024 | 04:52 AM

తెలంగాణపై చలి పులి పంజా విసురుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్నాయి. నాలుగు రోజుల వ్యవధిలోనే ఏకంగా పది డిగ్రీల మేర పడిపోయాయి.

Cold Wave: రాష్ట్రంపై ‘చలి పంజా’

  • రాత్రిపూట సింగిల్‌ డిజిట్‌కు పడిపోతున్న ఉష్ణోగ్రతలు

  • ఆదిలాబాద్‌ జిల్లాలో 6.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు

  • చలితో బయటకు రావాలంటేనే జంకుతున్న జనం

హైదరాబాద్‌/ఆదిలాబాద్‌/ఆసిఫాబాద్‌, , డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణపై చలి పులి పంజా విసురుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్నాయి. నాలుగు రోజుల వ్యవధిలోనే ఏకంగా పది డిగ్రీల మేర పడిపోయాయి. శుక్రవారం రాత్రి ఆదిలాబాద్‌ జిల్లాలోని బేలలో రాష్ట్రంలోనే అత్యల్పంగా 6.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత ఇదే కావడం గమనార్హం. అలాగే ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌లో 6.7, నిర్మల్‌ జిల్లా పెంబిలో 9.3, కామారెడ్డి జిల్లా జుక్కల్‌లో 9.4 సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌లో 9.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


మిగతా అన్ని జిల్లాల్లోనూ 10 నుంచి 17 డిగ్రీల మధ్యనే రాత్రిపూట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 2 రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు మేర పడిపోయే అవకాశం ఉందని పేర్కొంది. చలితో ఉదయం 9 గంటలు దాటిననప్పటికీ బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు.

Updated Date - Dec 15 , 2024 | 04:52 AM