Share News

90,56,383 నివాసాల్లో ఇంటింటి సర్వే

ABN , Publish Date - Nov 21 , 2024 | 04:02 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ, కులగణన రాష్ట్రంలో ముమ్మరంగా సాగుతోంది. బుధవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 90,56,383, నివాసాల్లో సర్వే పూర్తయింది.

90,56,383 నివాసాల్లో ఇంటింటి సర్వే

  • లక్ష్యంలో 78ు పూర్తి.. అగ్రస్థానంలో ములుగు, జనగామ

హైదరాబాద్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ, కులగణన రాష్ట్రంలో ముమ్మరంగా సాగుతోంది. బుధవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 90,56,383, నివాసాల్లో సర్వే పూర్తయింది. ఈ సమగ్ర ఇంటింటి సర్వేలో మొత్తం 1,16,14,349 నివాసాలు కాగా ఇప్పటిదాకా 90.56,383 నివాసాల్లో సర్వే చేసి 78 శాతం లక్ష్యం పూర్తిచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ములుగు జిల్లాలో 97.552 నివాసాలు సర్వే చేయాల్సి ఉండగా లక్ష్యాన్ని మించి 98,080 నివాసాల సర్వేతో మొదటి స్థానంలో నిలిచింది. జనగాం జిల్లా 99.9 శాతం పూర్తిచేసి రెండో స్థానంలో నిలిచింది. నల్లగొండ జిల్లా 97.7 శాతంతో తృతీయ స్థానంలో ఉంది.


కామారెడ్డిలో 93.3 శాతం, మంచిర్యాల 93.2 శాతం, యాదాద్రి భువనగిరిలో 92.3 శాతం, నిజామాబాద్‌లో 91శాతం, సిరిసిల్ల 90.9శాతం, జగిత్యాలలో 90.6శాతం, మిగిలిన 9 జిల్లాలో 90 శాతం పైగా సర్వే పూర్తయింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో సర్వే ప్రక్రియ ఊపందుకుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 25,05,517 నివాసాలు సర్వే చేయల్సి ఉండగా ఇప్పటి వరకు 13,91,817 నివాసాల్లో అంటే 55.6 శాతం సర్వే పూర్తి చేశారు. ఈ సర్వే కు ప్రజల నుంచి మంచి స్పందన ఉందని అధికారులు వివరించారు. 52,493 గ్రామీణ, 40,901 అర్బన్‌ బ్లాకులుగా మొత్తం 92,901 బ్లాకులుగా విభజించి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ సర్వే పనులు సకాలంలో పూర్తి చేసే విధంగా జిల్లా ఇన్‌చార్జి అదికారులు కలెకర్లు ఎప్పటిప్పుడు సమీక్షించి తగిన చర్యలు తీసుకుటున్నట్టు అధికారులు పేర్కొన్నారు.

Updated Date - Nov 21 , 2024 | 04:02 AM