Share News

Hyderabad: వేయిపడగలు చదవకుండా చనిపోతే గొప్ప కళానుభవం కోల్పోయినట్టే

ABN , Publish Date - Nov 25 , 2024 | 03:30 AM

కవిసామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ రచించిన వేయిపడగలు నవల చదవకుండా చనిపోతే గొప్ప కళానుభవం కోల్పోయినట్టేనని తెలుగు వర్సిటీ వీసీ నిత్యానంద రావు చెప్పారు. తెలుగు వారంతా ఇప్పటికీ తప్పకుండా చదవాల్సిన నవల వేయిపడగలేనన్నారు.

Hyderabad: వేయిపడగలు చదవకుండా చనిపోతే గొప్ప కళానుభవం కోల్పోయినట్టే

  • తెలుగు వర్సిటీ వీసీ నిత్యానంద రావు

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): కవిసామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ రచించిన వేయిపడగలు నవల చదవకుండా చనిపోతే గొప్ప కళానుభవం కోల్పోయినట్టేనని తెలుగు వర్సిటీ వీసీ నిత్యానంద రావు చెప్పారు. తెలుగు వారంతా ఇప్పటికీ తప్పకుండా చదవాల్సిన నవల వేయిపడగలేనన్నారు. అమీర్‌పేటలోని సెస్‌ సభామందిరంలో ఆదివారం జరిగిన విశ్వనాథ సాహిత్యపీఠం ద్విదశాబ్ది ఉత్సవాల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రోజంతా సాగిన సదస్సులో ‘‘విశ్వనాథ రచనల్లో హాస్యరసం’’, ‘‘తెలంగాణతో విశ్వనాథ అనుబంధం’’ తదితర అంశాలపై పలువురు సాహితీ విమర్శకులు, కవులు, రచయితలు కీలకోపన్యాసం చేశారు డెబ్భై ఐదేళ్ల కిందట తన ఆహ్వానం మేరకు కోఠి లోని వీవీ కాలేజీ కార్యక్రమంలో పాల్గొన్న విశ్వనాథ సత్యనారాయణ..


కార్ల్‌ మార్క్స్‌ శ్రమ సిద్ధాంతానికి, భగవద్గీతకు మధ్య సారూప్యతను వర్ణిస్తూ గంట సేపు అద్భుతంగా ప్రసంగించారని ఆనాటి విషయాలను వెల్చాల కొండలరావు గుర్తుచేసుకొన్నారు. విశ్వనాథ పీఠం ద్వారా సాహిత్య కృషి చేస్తున్న వెల్చాల కొండలరావు సేవలను కవిసామ్రాట్‌ మనుమడు విశ్వనాథ సత్యనారాయణ ప్రశంసించారు. కోస్తాంధ్ర వ్యవహార భాషావాదాన్ని వ్యతిరేకించిన కొంత మంది తెలంగాణ సాహితీవేత్తలకు విశ్వనాథ ఆలంబనగా నిలిచారని సీనియర్‌ ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌ తెలిపారు. హైదరాబాద్‌ రాష్ట్రంలోని సహజీవన సంస్కృతిని విశ్వనాథ రచనల్లో ప్రతిబింబించారంటూ తెలంగాణతో కవిసామ్రాట్‌ తమకున్న అనుబంధాన్ని విశ్లేషిస్తూ మాట్లాడారు.

Updated Date - Nov 25 , 2024 | 03:30 AM