Share News

Yellareddy MLA: ఎన్నికల ప్రచారంలో హామీ... నెరవేరుస్తున్న ఎమ్మెల్యే

ABN , Publish Date - Jun 11 , 2024 | 03:56 PM

దేవుడి పేరిట ఓట్లు అడగడం.. రాముడి పేరిట దొంగ అక్షింతలు పంచడం వల్లే ఈ సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో తమ పార్టీ మెజార్టీ తగ్గిందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి వెళ్లాయన్నారు.

Yellareddy MLA: ఎన్నికల ప్రచారంలో హామీ... నెరవేరుస్తున్న ఎమ్మెల్యే

కామారెడ్డి, జూన్ 11: దేవుడి పేరిట ఓట్లు అడగడం.. రాముడి పేరిట దొంగ అక్షింతలు పంచడం వల్లే ఈ సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో తమ పార్టీ మెజార్టీ తగ్గిందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి వెళ్లాయన్నారు. అయోధ్యలోనే వారి పార్టీ ఓడిపోయిందంటూ బీజేపీపై ఆయన పరోక్షంగా విమర్శించారు.

గాంధారి మండలం సర్వాపూర్ గ్రామాధ్యక్షుడు వెంకట్ అకాల మృతి చెందారు. ఈ నేపథ్యంలో అతడి కుటుంబాన్ని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా వెంకట్ కుటుంబానికి రూ. 4 లక్షలు ఆర్థిక సాయాన్ని ఆయన అందించారు. ఈ నగదును సొంత ఇంటి నిర్మాణానికి వినియోగించుకోవాలని ఆ కుటుంబానికి ఆయన సూచించారు. వెంకట్ భార్యకు వితంతు పెన్షన్ మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

Also Read: Loksabha Election Result: మంత్రి పదవికి జితిన్ ప్రసాద రాజీనామా.. ఎందుకంటే..


అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. పేదలను ఆదుకుంటామని ఎమ్మెల్యే మదన్ మోహన్ పేర్కొన్నారు. ఎల్లారెడ్డిలో 50 ఎకరాల్లో ఐటీ కారిడార్ ఏర్పాటు చేస్తామన్నారు. నాగిరెడ్డిపేట-ఎల్లారెడ్డి మధ్య రహదారి విస్తర్ణ పనులు చేపట్టనున్నామని తెలిపారు.

Also Read: Odisha: సీఎం ప్రమాణ స్వీకారం.. రేపు మధ్యాహ్నం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు

ఇక నియోజకవర్గంలో రూ. 200 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. రేవంత్ కేబినెట్‌లో తనకు అవకాశం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఈ ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. నెలకు ఒక రూపాయి మాత్రమే జీతంగా తీసుకుంటానంటూ మదన్‌మోహన్‌రావు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్లారెడ్డి ప్రజలకు మాట ఇచ్చారు. ఆ క్రమంలో ఆయన.. నెలకు ఒక రూపాయి మాత్రమే జీతంగా తీసుకుంటున్నారు.


మిగిలిన నగదును ప్రజా శ్రేయస్సు కోసం వినియోగిస్తానని ఆయన స్పష్టం చేశారు. అందులోభాగంగా తన జీతంలో మిగిలిన నగదును.. అకాల మరణం చెందిన సర్వాపూర్ గ్రామాధ్యక్షుడు వెంకట్‌ కుటుంబానికి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆర్థిక సాయం కింద అందజేశారు.

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 11 , 2024 | 03:56 PM