Share News

Family Survey: సర్వేతో ప్రజల అవసరాలేంటో తెలుస్తాయ్‌

ABN , Publish Date - Nov 09 , 2024 | 04:09 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేతో ప్రజలకు ఏమేం అవసరాలు ఉన్నాయో ప్రభుత్వానికి తెలుస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు.

Family Survey: సర్వేతో ప్రజల అవసరాలేంటో తెలుస్తాయ్‌

  • ఖమ్మంలో సర్వేను ప్రారంభించిన మంత్రి పొంగులేటి

ఖమ్మం రూరల్‌/ నేలకొండపల్లి, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేతో ప్రజలకు ఏమేం అవసరాలు ఉన్నాయో ప్రభుత్వానికి తెలుస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్‌ మండలం వెంకటగిరి పంచాయతి పరిధిలోని కోటనారాయణపురం గ్రామంలో ఆయన సర్వేకు శ్రీకారం చుట్టారు.


ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడైనా కులగణన చేయాలంటే తెలంగాణ రాష్ట్రం మోడల్‌గా నిలుస్తుందని తెలిపారు. ప్రతీ ఎన్యూమరేటర్‌ 170 ఇళ్ల వరకు సర్వే చేస్తారని, 75 కాలమ్‌లతో కులగణన సర్వే చేస్తున్నట్లు పేర్కొన్నారు. అధికారులు, ఉద్యోగులు ఏ చిన్న పొరపాటు, తప్పిందం జరగకుండా పూర్తి పారదర్శకంగా సర్వే పూర్తి చేయాలని సూచించారు.

Updated Date - Nov 09 , 2024 | 04:09 AM