Share News

ఇంటర్నల్‌ మార్కులు యథాతథం

ABN , Publish Date - Nov 30 , 2024 | 03:55 AM

పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఇంటర్నల్‌ మార్కులను రద్దు చేయాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వచ్చే ఏడాదికి వాయిదా వేసింది. రద్దు నిర్ణయాన్ని ఈ ఏడాది అమలు చేయడం లేదని, వచ్చే విద్యా సంవత్సరం (2025-26) నుంచి దీనిని అమలు చేస్తామని ప్రకటించింది.

ఇంటర్నల్‌ మార్కులు యథాతథం

  • పదో తరగతి పరీక్షలపై ప్రభుత్వ నిర్ణయం

  • వచ్చే విద్యా సంవత్సరం నుంచి రద్దు

  • ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ

హైదరాబాద్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఇంటర్నల్‌ మార్కులను రద్దు చేయాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వచ్చే ఏడాదికి వాయిదా వేసింది. రద్దు నిర్ణయాన్ని ఈ ఏడాది అమలు చేయడం లేదని, వచ్చే విద్యా సంవత్సరం (2025-26) నుంచి దీనిని అమలు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.వెంకటేశం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం.. పదో తరగతి వార్షిక పరీక్షల్లో 80ు మార్కులు, ఇంటర్నల్‌ అసె్‌సమెంట్‌కు 20ు మార్కులను కేటాయిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇంటర్నల్‌ మార్కులను రద్దు చేస్తున్నట్లు, ఇకపై కేవలం వార్షిక పరీక్షలల్లో వచ్చే మార్కుల ఆధారంగానే గ్రేడింగ్‌ ఇస్తామని ప్రభుత్వంగురువారం ప్రకటించింది.


ఈ విద్యా సంవత్సరం (2024-25) నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని కూడా తెలిపింది. కానీ, వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న వార్షిక పరీక్షలకు సంబంధించి విద్యార్థులు ఇప్పటికే 80ు మార్కుల విధానం ప్రకారం సిద్ధమవుతుండడం, దాదాపుగా సిలబస్‌ పూర్తయి.. పరీక్షలకు ప్రిపరేషన్‌ మొదలు పెట్టిన నేపథ్యంలో ఇంటర్నల్‌ మార్కుల విషయంలో ప్రభుత్వం పునరాలోచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు కొత్త నిర్ణయాన్ని అమలు చేస్తే.. విద్యార్థులు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం కావడం కూడా ఇందుకు కారణమైనట్లు సమాచారం.

Updated Date - Nov 30 , 2024 | 03:55 AM