Share News

Tummala: చేనేతకు 490 కోట్ల బకాయిల చెల్లింపులు

ABN , Publish Date - Dec 17 , 2024 | 03:29 AM

చేనేత రంగానికి తమ ప్రభుత్వం రూ.490 కోట్ల బకాయిలు చెల్లించినట్లు చేనేత, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Tummala: చేనేతకు 490 కోట్ల బకాయిల చెల్లింపులు

  • మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్‌, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): చేనేత రంగానికి తమ ప్రభుత్వం రూ.490 కోట్ల బకాయిలు చెల్లించినట్లు చేనేత, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా శాసనమండలిలో సోమవారం చేనేత కార్మికుల సమస్యలపై బీఆర్‌ఎస్‌ సభ్యులు ఎల్‌.రమణ, కవిత తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఈ మేరకు సమాధానం ఇచ్చారు.


ఇందిరా మహిళా శక్తి కింద మహిళా స్వయం సహాయక సంఘాలకు చెందిన 64.70లక్షల మంది ఆడపడుచులకు ఉచితంగా చీరలు ఇస్తామని వెల్లడించారు. ఏడాదికి రెండుసార్లు 129.40లక్షల చీరలు పంపిణీ చేయడానికి ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. చేనేత కార్మికులకు రుణమాఫీ చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో ఏడాదిగా 13 మంది చేనేత కార్మికులు వేర్వేరు కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు మంత్రి తెలిపారు.

Updated Date - Dec 17 , 2024 | 03:29 AM