Share News

Bhatti Vikramarka: త్వరలో ఫీజు రియంబర్స్‌మెంట్‌ బకాయిల చెల్లింపు

ABN , Publish Date - Dec 17 , 2024 | 03:23 AM

రెండేళ్లుగా పెండింగులో ఉన్న ఫీజు రియంబర్స్‌మెంట్‌ బకాయిలను ప్రభుత్వం సాధ్యమైనంత త్వరలో చెల్లిస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.

Bhatti Vikramarka: త్వరలో ఫీజు రియంబర్స్‌మెంట్‌ బకాయిల చెల్లింపు

  • ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

హైదరాబాద్‌, డిసెంబరు16(ఆంధ్రజ్యోతి): రెండేళ్లుగా పెండింగులో ఉన్న ఫీజు రియంబర్స్‌మెంట్‌ బకాయిలను ప్రభుత్వం సాధ్యమైనంత త్వరలో చెల్లిస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సోమవారం సచివాలయంలో తనను కలిసిన ప్రైవేట్‌ ఇంటర్‌, డిగ్రీ, పీజీ కళాశాలల యజమాన్యాల సంఘం ప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు. పెండింగు బకాయిలను చెల్లించాలన్న ప్రతినిధుల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారు.


అసెంబ్లీ సమావేశాల తర్వాత నాన్‌ ప్రొఫెషనల్‌ కాలేజీలకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రియంబర్స్‌మెంట్‌ బిల్లుల చెల్లింపు ప్రక్రియను మొదలు పెడతామన్నారు. నాన్‌ ప్రొఫెషనల్‌ కాలేజీలకు బకాయిలను పూర్తిగా చెల్లించడానికి వీలైనంత తొందరగా కృషి చేస్తామన్నారు. బీఆర్‌ఎస్‌ పాలకులు 10 సంవత్సరాల్లో చేసిన అప్పులకు ఈ 10 నెలల కాలంలో అప్పులు, వడ్డీల కింద రూ. 66 వేల కోట్లు బ్యాంకులకు కట్టామని భట్టి విక్రమార్క తెలిపారు.

Updated Date - Dec 17 , 2024 | 03:23 AM