Share News

High Court: గ్రూప్‌-2 పరీక్షల వాయిదాకు హైకోర్టు నో

ABN , Publish Date - Dec 10 , 2024 | 04:25 AM

అన్ని ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యంలో ఈనెల 15 నుంచి జరగనున్న గ్రూప్‌-2 పరీక్షల వాయిదాకు హైకోర్టు నిరాకరించింది. రైల్వే పరీక్షలు జరగనున్న దృష్ట్యా గ్రూప్‌-2 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ పలు జిల్లాల

High Court: గ్రూప్‌-2 పరీక్షల వాయిదాకు హైకోర్టు  నో

హైదరాబాద్‌, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): అన్ని ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యంలో ఈనెల 15 నుంచి జరగనున్న గ్రూప్‌-2 పరీక్షల వాయిదాకు హైకోర్టు నిరాకరించింది. రైల్వే పరీక్షలు జరగనున్న దృష్ట్యా గ్రూప్‌-2 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ పలు జిల్లాలకు చెందిన 22 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ పుల్ల కార్తీక్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది వాదిస్తూ ఈనెల 15, 16 తేదీల్లో జరగనున్న పరీక్షలకు ఇప్పటికే లక్ష మందికి పైగా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారని పేర్కొన్నారు. కొద్ది మంది కోసం పరీక్ష వాయిదా వేయడం సమంజసం కాదని తెలిపారు. దీంతో ఏకీభవించిన ధర్మాసనం ఈ దశలో ఎలాంటి స్టే ఇవ్వలేమని ఽఽపేర్కొంది. వివరణ ఇవ్వాలని టీజీపీఎస్సీ, రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు, రైల్వే శాఖ తదితరులకు నోటీసులు జారీచేస్తూ విచారణను వాయిదా వేసింది.

Updated Date - Dec 10 , 2024 | 04:25 AM