Exams: మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు
ABN , Publish Date - Dec 17 , 2024 | 04:22 AM
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 3వ తేదీ నుంచి జరగనున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు అధికారులు సోమవారం విడుదల చేశారు.
ఫిబ్రవరి 3 నుంచి ప్రాక్టికల్స్
షెడ్యూల్ విడుదల చేసిన బోర్డు
మార్చి నెలాఖరు నుంచి పది పరీక్షలు?
హైదరాబాద్,డిసెంబరు16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 3వ తేదీ నుంచి జరగనున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు అధికారులు సోమవారం విడుదల చేశారు. మార్చి 5 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్, మార్చి 6వ తేదీ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వార్షిక పరీక్షలు ప్రారంభం అవుతాయి. మార్చి 25వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్ పరీక్షల్లో భాగంగా ఎథిక్స్, హ్యూమన్ వ్యాల్యూ పరీక్షలను జనవరి 29వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నారు. జనవరి 30వ తేదీన ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలను ఉదయం 10 నుంచి 1 గంట వరకు నిర్వహించాలని అధికారులు సూచించారు. జనవరి 31వ తేదీన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీషు ప్రాక్టికల్ పరీక్షలను, ఫిబ్రవరి 1వ తేదీన ఇంటర్ సెకండ్ ఇయర్ ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించనున్నారు.
ఫిబ్రవరి 3 నుంచి ప్రాక్టికల్స్!
ఫిబ్రవరి 3వ తేదీ నుంచి రాష్ట్రంలో ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ పరీక్షలు ఫిబ్రవరి 3 నుంచి 22వ తేదీ వరకు జరగనున్నాయి. ప్రతీ రోజు రెండు సెషన్స్‌లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. మొదటి సెషన్‌ను ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, రెండవ సెషన్‌ను మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు.
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ వివరాలు (మొదటి ఏడాది పరీక్షలు)
తేదీ పరీక్ష పేరు
05-03-2025 సెకెండ్ ల్యాంగ్వేజి పేపర్-1
07-03-2025 ఇంగ్లీషు పేపర్-1
11-03-2025 మ్యాథమేటిక్స్ పేపర్-1ఏ,
బోటనీ పేపర్-1,
పొలిటికల్ సైన్స్ పేపర్-1
13-03-2025 మ్యాథమేటిక్స్ పేపర్-1బి,
జంతుశాస్త్రం పేపర్-1,
చరిత్ర పేపర్-1
17-03-2025 ఫిజిక్స్ పేపర్-1,
ఎకనామిక్స్ పేపర్-1
19-03-2025 కెమిస్ర్టీ పేపర్-1,
కామర్స్ పేపర్-1
21-03-2025 పబ్లిక్ అడ్మినిస్ర్టేషన్ పేపర్-1,
బ్రిడ్జికోర్సు మ్యాథ్స్ పేపర్-1
24-03-2025 మోడరన్ లాంగ్వేజి పేపర్-1,
జాగ్రఫీ పేపర్-1
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్
వివరాలు (రెండవ ఏడాది పరీక్షలు)
తేదీ పరీక్ష పేరు
06-03-2025 సెకెండ్ ల్యాంగ్వేజి పేపర్-2
10-03-2025 ఇంగ్లీషు పేపర్-2
12-03-2025 మ్యాథమేటిక్స్ పేపర్-2ఏ,
బోటని పేపర్-2,
పొలికల్ సైన్స్ పేపర్-2
15-03-2025 మ్యాథమేటిక్స్ పేపర్-2బి,
జంతుశాస్త్రం పేపర్-2,
చరిత్ర పేపర్-2
18-03-2025 ఫిజిక్స్ పేపర్-2,
ఎకనామిక్స్ పేపర్-2
20-03-2025 కెమిస్ర్టీ పేపర్-2,
కామర్స్ పేపర్-2
22-03-2025 పబ్లిక్ అడ్మినిస్ర్టేషన్ పేపర్-2,
బ్రిడ్జికోర్సు మ్యాథ్స్ పేపర్-2
25-03-2025 మోడరన్ లాంగ్వేజి పేపర్-2,
జాగ్రఫీ పేపర్-2
మార్చి నెలాఖరు నుంచి టెన్త్ పరీక్షలు!
ఈ ఏడాది పదవ తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ఒకటి రెండు రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి అధికారులు కసరత్తును చేస్తున్నారు. మార్చి నెలాఖరు నుంచి ఈ పరీక్షలు ప్రారంభం అయ్యే విధంగా షెడ్యూల్‌ను రూపొందిస్తున్నట్టు సమాచారం. ఏడు రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.