TG Politics:కేసీఆర్ ఫ్యామిలీ నాటకం.. యువత బలిదానాలకు కారణం
ABN , Publish Date - Dec 15 , 2024 | 10:54 AM
గతేడాది అంటే 2023 చివరిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తెలంగాణ ఓటరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొలువు తీరింది.

హైదరాబాద్, డిసెంబర్ 15: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగంగా దీక్ష పేరుతో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం చేసిన నాటకం.. యువత బలిదానాలకు కారణమైందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. అధికారం కోల్పోయామనే అక్కసుతో అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ అగ్రనేతలపై ఆయన మండిపడ్డారు.
Also Read: మోహన్‌బాబు ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం వెనుకబాటుకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆదివారం బహిరంగ లేఖ రాశారు. ఫౌంహౌస్ నుంచి పాచికలు వేయడం కాదు.. ప్రజా క్షేత్రానికి రావాలన్న ఈ సందర్భంగా కేసీఆర్‌కు మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు. ఇప్పటికైనా బయటకు రావాలంటూ కేసీఆర్‌కు మహేశ్ కుమార్ గౌడ్ హితవు పలికారు. అధికార అహంకారంతో మీ పార్టీ నుంచి తెలంగాణ అనే పదాన్ని తొలగించారని మాజీ సీఎం కేసీఆర్‌కు గుర్తు చేశారు.
Also Read: నేడు నాగపూర్‌కు సీఎం, డిప్యూటీ సీఎం
బతుకమ్మను రాజకీయంగా వాడుకుని తెలంగాణ మహిళలను సైతం అవమానించారన్నారు. తెలంగాణ అస్తిత్వం అయిన తెలంగాణ తల్లి, తెలంగాణ గీతాన్ని తాము అధికారికంగా ప్రకటించామని వివరించారు. అబద్దాలే అజెండాగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు రాజకీయ మనుగడ సాగిస్తున్నారని మండిపడ్డారు.
టీజీపీఏస్సీని ప్రక్షాళన చేసి.. ఉద్యోగాల జాతర ప్రకటించామని ఆయన పేర్కొన్నారు. అన్న దాతలకు అండగా రుణ మాఫీ, రైతు భరోసా, రైతు బీమా, బోనసలు ఇస్తున్నామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌర్ వెల్లడించారు.
గతేడాది అంటే 2023 చివరిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తెలంగాణ ఓటరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొలువు తీరింది. దీంతో పదేళ్లు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైంది. అయితే పదేళ్ల పాలనలో పార్టీ అధినేతగానే కాకుండా.. సీఎంగా కేసీఆర్... పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ క్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చారు.
అలాగే ప్రభుత్వాధినేతగా కేసీఆర్ ఒక్కసారి కూడా సెక్రటేరియట్‌కు రాలేదు. అంటే బేగంపేటలోని క్యాంప్ కార్యాలయానికే పరిమితమయ్యారు. సీఎం ఎక్కడ ఉంటే అదే సచివాలయం అంటూ విలేకర్ల సమావేశంలో సైతం ముఖ్యమంత్రిగా కేసీఆర్ స్పష్టం చేశారు. మరోవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలపై పలు ఆరోపణలు వెలువెత్తాయి. హైదరాబాద్‌లోనే కాదు.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వేలాది ఆర్టీసీ బస్సులను తొలగించారు. ఈ తరహా చర్యలతో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఓ విధమైన వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు.
For Telangana News And Telugu News