Share News

Uttam: సంక్రాంతి నుంచి సన్నబియ్యం

ABN , Publish Date - Nov 05 , 2024 | 03:55 AM

సంక్రాం తి పండుగ నుంచి రాష్ట్రంలోని 2.80కోట్ల మందికి రేషన్‌ దుకాణాల ద్వారా సన్నబియ్యం అందిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

Uttam: సంక్రాంతి నుంచి సన్నబియ్యం

  • ధాన్యం కొనుగోళ్ల కోసం రూ.20వేల కోట్లు సిద్ధం: మంత్రి ఉత్తమ్‌

సూర్యాపేట(కలెక్టరేట్‌), నవంబరు 4(ఆంధ్రజ్యోతి): సంక్రాం తి పండుగ నుంచి రాష్ట్రంలోని 2.80కోట్ల మందికి రేషన్‌ దుకాణాల ద్వారా సన్నబియ్యం అందిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సూర్యాపేటలో నిర్మించిన డీఎస్పీ కార్యాలయాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎంఆర్‌ మిల్లింగ్‌ ఛార్జీలను సన్న బియ్యానికి ప్రస్తుతం ఉన్న రూ.10నుంచి రూ.50, దొడ్డు రకానికి రూ.10నుంచి రూ.40కి పెంచినట్లు తెలిపారు.


ధాన్యం సేకరణపై రాజకీయం చేసేందుకే ప్రతిపక్షాలు లేనిపోని విమర్శలు చేస్తున్నాయని, బీఆర్‌ఎస్‌ హయాంలో కంటే మెరుగ్గా ధాన్యం సేకరిస్తున్నామన్నారు. ధాన్యం కొనుగోళ్ల కోసం ప్రభుత్వం రూ.20వేల కోట్లను సిద్ధం చేసిందన్నారు. ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7,500 కొనుగోలు కేంద్రాలు సిద్ధం చేశామన్నారు. సన్నరకానికి క్వింటాకు మద్దతు ధరతో పాటు అదనంగా రూ.500 బోనస్‌ ఇస్తున్నట్లు వివరించారు.

Updated Date - Nov 05 , 2024 | 03:55 AM