Share News

TGPSC: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ చైౖర్మన్‌తో బుర్రా భేటీ

ABN , Publish Date - Dec 20 , 2024 | 04:25 AM

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ చైౖర్మన్‌ గోపాలకృష్ణణ్‌తో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ చైౖర్మన్‌ బుర్రా వెంకటేశం భేటీ అయ్యారు.

TGPSC: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ చైౖర్మన్‌తో బుర్రా భేటీ

హైదరాబాద్‌, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ చైౖర్మన్‌ గోపాలకృష్ణణ్‌తో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ చైౖర్మన్‌ బుర్రా వెంకటేశం భేటీ అయ్యారు. ఆయన ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం జరిగిన ఈ భేటీలో ఉద్యోగ నియామకాల్లో పాటిస్తున్న విధానంపై చర్చించారు. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నిర్వహించే నియామకాల్లో కొన్ని సార్లు 50 లక్షల మంది అభ్యర్థులకు పరీక్షలను నిర్వహించాల్సి ఉంటుంది. ఇంత భారీ సంఖ్యలో అభ్యర్థులకు పరీక్షలను నిర్వహించే సమయంలో పాటించే జాగ్రత్త పద్ధతులు, నియామక ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు.

Updated Date - Dec 20 , 2024 | 04:25 AM