Hyderabad: జూలైలో సీపీజెట్ పరీక్షలు..
ABN , Publish Date - May 16 , 2024 | 04:26 AM
పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే సీపీజెట్ పరీక్షలను జూలై నెలలో నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు బుధవారం విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రిలు సీపీజెట్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. దాని ప్రకారం ఈనెల 18 నుంచి వచ్చేనెల 17వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. రూ.500 ఆలస్య రుసుముతో జూన్ 25 వరకు, రూ.2 వేల ఆలస్యరుసుముతో జూన్ 30 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. జూలై 5వ తేదీ నుంచి సీపీజెట్ పరీక్షలు నిర్వహిస్తారు.
18 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు
హైదరాబాద్, మే 15 (ఆంధ్రజ్యోతి): పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే సీపీజెట్ పరీక్షలను జూలై నెలలో నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు బుధవారం విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రిలు సీపీజెట్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. దాని ప్రకారం ఈనెల 18 నుంచి వచ్చేనెల 17వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. రూ.500 ఆలస్య రుసుముతో జూన్ 25 వరకు, రూ.2 వేల ఆలస్యరుసుముతో జూన్ 30 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. జూలై 5వ తేదీ నుంచి సీపీజెట్ పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో మొత్తం 51 పీజీ కోర్సులు ఉండగా, వాటిలో మొత్తం 47,211 సీట్లు ఉన్నాయి. అయితే ఈ సీట్లలో గతేడాది 21,519 సీట్లు(43.46 ు) మాత్రమే భర్తీ అయ్యాయి. అలాగే గతేడాది పీజీ కోర్సుల్లో పురుషులు 5,412 మంది చేరగా మహిళలు 15,107 మంది చేరారు.