Share News

Telangana: అసెంబ్లీ కార్యదర్శికి ఆ అర్హత లేదు..

ABN , Publish Date - Nov 07 , 2024 | 05:11 PM

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. 'అనర్హత’ అంశంపై అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన పిటిషన్‌పై సింగిల్‌ జడ్జి సీరియస్ అయ్యారు.

Telangana: అసెంబ్లీ కార్యదర్శికి ఆ అర్హత లేదు..
TS high court

Telangana High Court: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. 'అనర్హత’ అంశంపై అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన పిటిషన్‌పై తొలుత కడియం శ్రీహరి తరఫున న్యాయవాది మయూర్‌రెడ్డి వాదనలు వినిపించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల తరఫున న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదించారు.

అర్హత లేదు..

అయితే, అసలు ఈ అప్పీల్‌లు దాఖలు చేసే అర్హత అసెంబ్లీ కార్యదర్శికి లేదని తెలుస్తుంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల పిటిషన్లను స్పీకర్‌ ముందు ఉంచాలని సింగిల్‌ జడ్జి చెప్పారు. ఆ తర్వాత స్పీకర్‌ సూచన మేరకు షెడ్యూల్‌ను రిజిస్ట్రీ ముందు ఉంచమన్నారు. స్పీకర్‌ ముందు ఉంచను అని చెప్పే అధికారం కార్యదర్శికి లేదని.. అతను ప్రభుత్వం నుంచి వేతనం పొందుతున్నారు.. కాబట్టి కోర్టు ఉత్తర్వులు పాటించాల్సిందేనని తేల్చి చెప్పారు.

విచారణ వాయిదా..

అధికారాలను ఎంజాయ్‌ చేస్తా.. విధులను మాత్రం నిర్వహించను అంటే సరికాదని హెచ్చరించారు. అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్‌లు మెయింటనబుల్‌ కాదని... కొట్టివేయాలని గండ్ర వాదనలు వినిపించారు. పార్టీ ఫిరాయించిన ఓ ఎమ్మెల్యే ఏకంగా ఎంపీగా పోటీ చేశారని అన్నారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.


కాగా, బీఆర్ఎస్​ నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్​లో చేరారని.. ఆ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ కూకట్​పల్లి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్, హుజూరాబాద్​శాసన సభ్యులు పాడి కౌశిక్​రెడ్డిలు కొద్ది రోజుల క్రితం వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేవారు. స్పీకర్ కార్యాలయంలో పిటిషన్ ఇచ్చినా స్పీకర్ చర్యలు తీసుకోలేదని కోర్టుకు పిటిషనర్లు తెలిపారు.


Also read:

ఎమ్మెల్సీ ఎన్నికలపై వైసీపీ షాకింగ్ నిర్ణయం

ఎన్నికల్లో చిచ్చు పెట్టేందుకే..

చెన్నై-నెల్లూరు మెము రైళ్ల రద్దు.. కారణం ఏంటంటే..

For More Telugu and National News

Updated Date - Nov 07 , 2024 | 06:31 PM