Lasya Nanditha: లాస్య నందిత మరణంతో ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్..
ABN , Publish Date - Feb 23 , 2024 | 01:06 PM
మితిమీరిన వేగం.. సీటు బెల్టు ధరించడంలో నిర్లక్ష్యం.. కారు ప్రమాద మరణాలకు ముఖ్య కారణం. పోలీసులు సైతం సీటు బెల్ట్ ధరించకుంటే ఫైన్ వేస్తామని చెబుతున్నా సరే.. మన చెవులకు వినిపించదు. ఇలా సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల ప్రమాదంలో మరిణించిన వారి లిస్ట్ చాలా పెద్దదే. కారు ఉన్న ప్రతి ఒక్కరికీ సీటు బెల్ట్‌పై పక్కాగా అవగాహన ఉంటుంది.
మితిమీరిన వేగం.. సీటు బెల్టు (Seat Belt) ధరించడంలో నిర్లక్ష్యం.. కారు ప్రమాద మరణాలకు ముఖ్య కారణం. పోలీసులు సైతం సీటు బెల్ట్ ధరించకుంటే ఫైన్ వేస్తామని చెబుతున్నా సరే.. మన చెవులకు వినిపించదు. ఇలా సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల ప్రమాదంలో మరిణించిన వారి లిస్ట్ చాలా పెద్దదే. కారు ఉన్న ప్రతి ఒక్కరికీ సీటు బెల్ట్‌పై పక్కాగా అవగాహన ఉంటుంది. అయినా సరే.. సమయం అలా వస్తుందో ఏమో కానీ సీటు బెల్ట్ మాత్రం ధరించరు. కారు వేగమూ తగ్గించరు. ఇక ప్రమాదాల నుంచి బయటపడేదెలా? కారులో ఎక్కడ కూర్చున్నామన్నది కాదు.. సీటు బెల్ట్ ధరించామా? లేదా? అన్నదే ముఖ్యం. ప్రమాదంలో ఎవరో ఒక ప్రముఖ వ్యక్తి మరణించినప్పుడల్లా సీటు బెల్ట్ ప్రాధాన్యం గురించి చర్చ జరుగుతూనే ఉంటోంది. తాజాగా ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) మరణంతో మరోసారి సీటు బెల్ట్ అంశం చర్చకు వస్తోంది.
సీటు బెల్ట్ ఉపయోగమేంటి?
వాహనం దేన్నయినా ఢీ కొట్టిప్పుడు కారులోని వ్యక్తులు వేగంగా ముందుకు వెళ్తారు. ఆ సమయంలో వాళ్లు డ్యాష్ బోర్డునో.. వెనుక కూర్చున్నవారైతే ముందు సీట్ల మధ్య నుంచి వెళ్లి అద్దాన్ని వేగంగా గుద్దుకునే ఆస్కారముంటుంది. ఇక వాహనం ఏమైనా పల్టీ కొట్టిందా.. ఏకంగా అద్దంలో నుంచి ముందుకు పడిపోవడం జరుగుతుంటుంది. లేదంటే డోర్ ఊడిపోయి ఒక్కసారిగా ఎగిరి బయట పడిపోతారు. అలా జరిగితే తీవ్ర గాయాలై వ్యక్తి మరణించే అవకాశం ఉంటుంది.
సీటు బెల్ట్ ధరించినప్పుడు ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టినా లేదంటే కారు పల్టీలు కొట్టినా పెద్దగా ఇబ్బంది ఉండదు. ముందుగా అద్దంలో నుంచి ముందుకు పడటమో లేదంటే డోర్ ఊడిపోయి ఎగిరి బయట పడటమో జరగదు. ఈ తరుణంలో సీటు బెల్ట్ వారిని రక్షిస్తుంది. సీటు బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి. దీంతో ప్రమాదం నుంచి సులభంగా గట్టెక్కవచ్చు. అత్యంత అరుదుగా మాత్రమే ఎయిర్ బ్యాగ్స్ సెన్సార్లు యాక్టివేట్ అయి, తెరుచుకోవడానికి 0.05 సెకన్ల సమయం పడుతుంది. ఇలా జరిగితే ఏమీ చెయ్యలేం. కానీ 99.95 శాతం మాత్రం సీటు బెల్ట్ పెట్టుకుంటే పక్కాగా బయటపడతాం.
సీటు బెల్ట్ ఎలా పని చేస్తుంది?
కొన్ని కార్లలో ముందు కూర్చున్న వారికి మాత్రమే సీటు బెల్ట్ ఉంటుంది. సాధారణంగా ఇప్పుడు కొత్తగా మార్కెట్‌లోకి వచ్చే కార్లలో అన్ని సీట్లకూ సీట్ బెల్ట్ ఉంటోంది. వాహనం ప్రమాదానికి గురైన వెంటనే కారులోని సెన్సర్లు యాక్టివేట్ అయిపోయి ఓ యాంగిల్‌ను ఏర్పరుచుకుంటాయి. ఇవి ఎయిర్‌బ్యాగ్ కంట్రోల్ యూనిట్‌కు సమాచారం అందిస్తాయి. వెంటనే బెలూన్ యాక్టివేట్ అయిపోయి తెరుచుకుంటుంది. ఇదంతా కేవలం సెకన్లలోనే జరిగిపోతుంది. ఒకవేళ సీటు బెల్ట్ పెట్టుకోలేదంటే ఈ ప్రక్రియ జరగడానికి ఆస్కారమే ఉండదు. వెరసి ఎయిర్‌బ్యాగ్స్ ఓపెన్ కావు.. ఫలితం మరణమే కావొచ్చు.