Home » Lasya Nanditha
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ముందుగా కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. శ్రీ గణేష్ పేరును కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని కన్ఫామ్ చేసింది.
Telangana: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థి పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా నారాయణ శ్రీ గణేష్ పేరును కాంగ్రెస్ హైకమాండ్ అధికారికంగా అనౌన్స్ చేసింది. ఈ మేరకు శనివారం ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కే.సీ వేణుగోపాల్ ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు. గణేష్ ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. కంటోన్మెంట్ అభ్యర్థిపై అనేక చర్చల అనంతరం చివరకు గణేష్ పేరునే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపింది.
Telangana: బీఆర్ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే ల్యాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. మే 13న కంటోన్మెంట్ ఉపఎన్నిక జరుగనుంది. ఎన్నికలకు సర్వం సిద్ధమవుతున్న తరుణంలో ఆయా పార్టీలు కంటోన్మెంట్లో పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి కంటోన్మెంట్ ఉప ఎన్నికలో విజయం సాధించాలని ఉద్దేశంతోనే ముందుకు సాగుతోంది. కంటోన్మెంట్లో పోటీ చేయబోయే అభ్యర్థి ఎంపికపై దృష్టి పెట్టి కాంగ్రెస్.. అందుకు అభ్యర్థి ప్రకటనపై ముహూర్తం కూడా నిర్ణయించింది. ఈనెల 27వ తేదీన కంటోన్మెంట్ అభ్యర్థిని హస్తం పార్టీ ప్రకటించనుంది.
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో 17 పార్లమెంట్ స్థానాలతో పాటు కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గానికి మే13 వ తేదీన పోలింగ్ జరగనుంది.
Lasya Nanditha Car Accident: బీఆర్ఎస్ యంగ్ ఎమ్మెల్యే లాస్య నందిత (BRS MLA Lasya Nanditha) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. మొదట డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతోనే ప్రమాదం జరిగిందని అందరూ భావించినప్పటికీ ఆలస్యంగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డ్రైవర్‌ను పదే పదే పోలీసులు విచారించినప్పటికీ ‘తెలియదు.. గుర్తులేదు..’ ఈ రెండు మాటలే చెప్పడంతో ఈ ప్రమాదంపై లోతుగా దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తులో ప్రమాదానికి సంబంధించిన ఒక్కో విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా ఈ కేసులో మరో కీలక అడుగు ముందుకు పడింది..
Telangana: దివంగత బీఆర్ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. లాస్య కారును ఢీకొన్న టిప్పర్ లారీనీ పటాన్చెరు పోలీసులు గుర్తించారు. యాక్సిడెంట్ జరిగిన రోజు టిప్పర్‌ను ఢీకొనడం వల్లే లాస్య నందిత మృతి చెందారు. ప్రస్తుతం టిప్పన్‌ను పోలీసులు సీజ్ చేశారు.
హైదరాబాద్: ఎమ్మెల్యే లాస్య నందిత ప్రమాదం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అతివేగంగా వచ్చిన లాస్య నందిత కారు ముందున్న టిప్పర్ లేదా రెడీమిక్స్ వాహనాన్ని ఢీ కొట్టినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం సమయంలో ఆరు టిప్పర్ లారీలు ఔటర్ రింగ్ రోడ్డుపై వెళ్లినట్లు గుర్తించారు.
సిట్టింగ్ శాసనసభ్యురాలు లాస్యనందిత(Lasyanandita) రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
మద్యం మత్తు, అతివేగం, నిర్లక్ష్యం వల్లే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏటా రోడ్డు ప్రమాదాల బారినపడి వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. బోయన్‌పల్లిలోని ఇంటి నుంచి మారేడుపల్లిలోని శ్మశాన వాటిక వరకు అంతిమ యాత్ర సాగింది. ఈ యాత్రలో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా పాల్గొని లాస్యకు తుది వీడ్కోలు పలికారు. ఇంటి నుంచి సాగిన అంతిమయాత్రలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి పాడె మోశారు.