TS Politics: టికెట్లు కన్ఫామ్ అయినా ‘కారు’ దిగి కమలం గూటికి ఎంపీలు.. పెద్ద ప్లానే ఉందిగా..!
ABN , Publish Date - Mar 03 , 2024 | 03:47 AM
బీఆర్‌ఎ్‌సకు చెందిన మరో ముగ్గురు లోక్‌సభ సభ్యులూ బీజేపీలో చేరనున్నారా..? ఇప్పటికే కాషాయ కండువా కప్పుకొన్న తమ ఇద్దరు సహచర ఎంపీల బాటలోనే వారూ నడవనున్నారా..
కారు దిగి కమలం గూటికి చేరనున్న ప్రజా ప్రతినిధులు
వారితో మంతనాలు సాగిస్తున్న కమలం పార్టీ ముఖ్యులు
ఎంపీల బాటలోనే మాజీ మంత్రి కుమారుడు కూడా!
వరంగల్, నల్లగొండలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు సైతం
హైదరాబాద్, మార్చి 2(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌కు (BRS) చెందిన మరో ముగ్గురు లోక్‌సభ సభ్యులూ బీజేపీలో చేరనున్నారా..? ఇప్పటికే కాషాయ కండువా (Telangana BJP) కప్పుకొన్న తమ ఇద్దరు సహచర ఎంపీల బాటలోనే వారూ నడవనున్నారా..? టికెట్లు దాదాపుగా ఖరారైనప్పటికీ గులాబీ పార్టీని వీడాలనే నిర్ణయానికి వచ్చేశారా..? బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు భావిస్తూ.. ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు దృష్టి సారిస్తున్నారా? కారు దిగి కమలం గూటికి వెళ్లనున్నారా..? రాజకీయ సమీకరణాలు చూస్తుంటే ఈ ప్రశ్నలన్నింటికీ ఔననే సమాధానమే వస్తోంది.
పెద్ద ప్లానే..!
తెలంగాణ నుంచి కనీసం పది ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ.. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ వారిని చేర్చుకునే దిశగా కసరత్తు ముమ్మరం చేసింది. ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీలపై దృష్టిసారించింది. బీజేపీకి చెందిన కీలక నేతలు.. గులాబీ పార్టీ ముగ్గురు ఎంపీలతో మంతనాలు జరుపుతున్నారని తెలిసింది. వారం, పది రోజుల్లో వీరి చేరికపై స్పష్టత రానుందని బీజేపీ ముఖ్య నాయకుడు ఒకరు వెల్లడించారు. ఈ ఎంపీల్లో ఒకరి స్థానానికి బీజేపీ శనివారం అభ్యర్థిని వెల్లడించింది. దీంతో ఆయన వేరే జిల్లాలోని నియోజకవర్గం నుంచి బరిలో దిగే అవకాశమూ ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌కు బలమున్న సీటులో క్రితంసారి బీఆర్‌ఎస్ తరఫున గెలిచిన ఎంపీ కూడా బీజేపీ వైపు చూస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సీటుకు బీజేపీ తొలి జాబితాలో అభ్యర్థులను ప్రకటించలేదు. కాగా, 2019 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ 9లోక్‌సభ సీట్లలో గెలిచింది. వీరిలో ఎంపీలు బీబీ పాటిల్ (జహీరాబాద్), పి.రాములు (నాగర్‌కర్నూల్) రెండు రోజుల వ్యవధిలో బీజేపీలో చేరారు. తొలి జాబితాలోనే పాటిల్‌కు టికెట్ రాగా, నాగర్‌కర్నూల్‌లో రాములు తనయుడు భరత్‌ను నిలిపారు.
వరంగల్, నల్లగొండలో మాజీ ఎమ్మెల్యేలు..
వరంగల్, నల్లగొండ లోక్‌సభ స్థానాలకు బీఆర్‌ఎ్‌సకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలతో బీజేపీ ముఖ్య నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం. తనయుడికి టికెట్ కోసం బీఆర్‌ఎస్ మాజీ మంత్రి ఒకరు కూడా టచ్‌లోకి వెళ్లినట్లు తెలిసింది. అయితే, తొలి జాబితాలో ఆ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. ఈ నేపథ్యంలో తండ్రీకొడుకుల వైఖరి ఎల ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి