Share News

Road Accident: గల్ఫ్‌లో రోడ్డు ప్రమాదం.. 9 మంది కార్మికుల మృతి

ABN , Publish Date - Dec 17 , 2024 | 05:43 AM

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో నిత్యావసర సరుకులుకొనుక్కొని ఎడారిలోని తమ క్యాంపునకు బస్సులో వెళ్తుండగా జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో 9 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా మరో 73 మంది గాయపడ్డారు.

Road Accident: గల్ఫ్‌లో రోడ్డు ప్రమాదం.. 9 మంది కార్మికుల మృతి

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో నిత్యావసర సరుకులుకొనుక్కొని ఎడారిలోని తమ క్యాంపునకు బస్సులో వెళ్తుండగా జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో 9 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా మరో 73 మంది గాయపడ్డారు. మృతులలో ఇద్దరు తెలంగాణ ప్రవాసీయులు అని సమాచారం. వారిలో ఒకరు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా మేడిపల్లి మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన షేర్‌ ఎర్రన్నతో పాటు మరోతెలంగాణకు చెందిన వ్యక్తి ఉన్నట్లు సమాచారం. వివిధ జిల్లాలకు చెందిన మరో అయిదుగురు తెలుగు ప్రవాసీయులు గాయపడినట్లు తెలుస్తోంది. అధికారికంగా మృతులు, క్షతగాత్రుల వివరాల్ని పోలీసులు వెల్లడించలేదు.


ఈ దుర్ఘటన వారాంతపు సెలవు దినమైన ఆదివారం రాత్రి అజ్మాన్‌ ఖోర్‌ ఫఖ్ఖాన్‌ మార్గం మధ్యలో జరగ్గా పోలీసులు సోమవారం సాయంత్రం దీనికి సంబంధించి అధికారిక ప్రకటన చేశారు. బ్రేకులు ఫెయిలవడంతో బస్సు డ్రైవర్‌ అదుపు తప్పి ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. మృతులందరు అజ్మాన్‌లో ఒక ప్రముఖ నిర్మాణ సంస్థలో పని చేస్తున్నారు. నెలకు ఒకసారి వీరు ఎడారి క్యాంపు నుంచి నగరానికి వచ్చి నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకొని తిరిగి వెళ్తారు. దుబాయిలోని భారతీయ కాన్సులేటు గానీ షార్జా పోలీసులు గానీ మృతుల వివరాలు వెల్లడించలేదు.

Updated Date - Dec 17 , 2024 | 05:43 AM