Hyderabad: నిబంధనల ప్రకారమే వైద్య శాఖలో బదిలీలు: దామోదర
ABN , Publish Date - Aug 08 , 2024 | 09:43 PM
జీవో నంబర్ 80 ప్రకారమే దీర్ఘకాలికంగా ఒకే చోట విధులను నిర్వహిస్తున్న 40 శాతం ఉద్యోగుల సర్వీసును గుర్తించి బదిలీల ప్రక్రియ చేపట్టామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ(Damodar Rajanarasimha) తెలిపారు.
హైదరాబాద్: జీవో నంబర్ 80 ప్రకారమే దీర్ఘకాలికంగా ఒకే చోట విధులను నిర్వహిస్తున్న 40 శాతం ఉద్యోగుల సర్వీసును గుర్తించి బదిలీల ప్రక్రియ చేపట్టామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ(Damodar Rajanarasimha) తెలిపారు. ఇందుకు సంబంధించి ఆయన ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. ఆసుపత్రుల పనితీరుకు, రోగులకు ఎలాంటి ఆటంకం కలగకుండా బదిలీలను పారదర్శకంగా చేపట్టామన్నారు. జీవో నెంబర్ 80 ప్రకారం సూపర్ స్పెషాలిటీ సేవలలో అత్యవసర పరిస్థితులను పరిగణలోకి తీసుకొని బదిలీల్లో స్పెషాలిటీ డాక్టర్లకు మినహాయింపు ఇచ్చినట్లు చెప్పారు.
వైద్యులు, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లను కాంట్రాక్టు పద్ధతిన 2024 మార్చిలో నియమించినట్లు చెప్పారు. వీటితోపాటు ఆగస్టు 9 న వైద్యులు, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లను కాంట్రాక్టు పద్ధతిన నియమించడానికి షెడ్యూలు విడుదల చేశామన్నారు. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులలో బదిలీల ప్రభావం పడలేదని స్పష్టం చేశారు. రోగులకు నిరంతరం వైద్య సదుపాయాలు అందుతున్నాయని దామోదర వెల్లడించారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులలో తగిన సంఖ్యలో వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది ఉన్నారని వివరించారు.
ఉస్మానియా ఆసుపత్రిలో 07.08.2023 న ఉన్న ఉద్యోగులు...
డాక్టర్లు - 169
జూనియర్ రెసిడెంట్లు - 69
పోస్ట్ గ్రాడ్యుయేట్లు - 1,638
నర్సింగ్ ఆఫీసర్ లు - 247
మొత్తం - 2,123
ఉస్మానియా ఆసుపత్రిలో 07.08.2024 వరకు ఉన్న ఉద్యోగులు...
డాక్టర్లు - 266
సీనియర్ రెసిడెంట్లు - 218
పోస్ట్ గ్రాడ్యుయేట్స్ - 1,638
నర్సింగ్ ఆఫీసర్లు - 263
మొత్తం - 2,385
గాంధీ ఆసుపత్రిలో 07.08.2023 న ఉన్న ఉద్యోగులు...
డాక్టర్లు - 295
జూనియర్ రెసిడెంట్లు - 51
పోస్ట్ గ్రాడ్యుయేట్లు - 723
నర్సింగ్ ఆఫీసర్ లు - 191
మొత్తం - 1,260
గాంధీ ఆసుపత్రిలో 07.08.2024 వరకు ఉన్న ఉద్యోగులు...
డాక్టర్లు - 362
సీనియర్ రెసిడెంట్లు - 119
పోస్ట్ గ్రాడ్యుయేట్స్ - 723
నర్సింగ్ ఆఫీసర్లు - 287
మొత్తం - 1,491 ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.