Share News

Transgender Scam: దోష నివారణ పేరిట ట్రాన్స్‌జెండర్‌ మోసం

ABN , Publish Date - Nov 16 , 2024 | 05:22 AM

‘‘మీ ఇంటో దోషం ఉంది, నివారణ పూజలు చేయాల’’ంటూ ఓ అమాయక మహిళను, ఆమె తమ్ముడిని ఓ ట్రాన్స్‌జెండర్‌ మోసం చేసింది. శాంతి పూజలు పేరిట వారి నుంచి దాదాపు రూ.55 లక్షలు దోచుకుంది.

Transgender Scam: దోష నివారణ పేరిట ట్రాన్స్‌జెండర్‌ మోసం

  • జనగామలో అక్కాతమ్ముళ్ల నుంచి రూ.55 లక్షలు కాజేత

జనగామ, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): ‘‘మీ ఇంటో దోషం ఉంది, నివారణ పూజలు చేయాల’’ంటూ ఓ అమాయక మహిళను, ఆమె తమ్ముడిని ఓ ట్రాన్స్‌జెండర్‌ మోసం చేసింది. శాంతి పూజలు పేరిట వారి నుంచి దాదాపు రూ.55 లక్షలు దోచుకుంది. జనగామ జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జనగామ సీఐ దామోదర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జనగామలోని వెంకన్నకుంటకు చెందిన ఉప్పల సిరివెన్నెలకు నిరోష అనే స్నేహితురాలి ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం సత్యనారాయపురం గ్రామానికి చెందిన నాగదేవి అనే ట్రాన్స్‌జెండర్‌ పరిచయం అయింది. ఈ ఏడాది జూన్‌లో నాగదేవి జనగామకు రాగా సిరివెన్నెల తన కుటుంబంలోని సమస్యలను ఆమెకు వివరించింది.


‘‘మీ ఇంటో దోషం ఉంది. అందుకే ఇలా జరుగుతోంది. దోషం తొలగాలంటే పూజాలు చేయాలి. అందుకు పెద్దమొత్తంలో డబ్బు అవసరమవుతుంది’’ అని నాగదేవి చెప్పింది. ఈ విషయాన్ని సిరివెన్నెల మేడ్చల్‌లోని తన తమ్ముడు నిఖిల్‌కు వివరించింది. అనంతరం జనగామలో నాగదేవి ఇంట్లో ఓసారి, మేడ్చల్‌లోని నిఖిల్‌ ఇంట్లో ఓసారి నాగదేవి పూజలు చేసింది. ఈ క్రమంలో వారి నుంచి రూ.55 లక్షల వరకు వసూలు చేసింది. ఇందులో రూ.13 లక్షలు లిక్విడ్‌ క్యాష్‌ రూపంలో, మిగిలినవి ఆన్‌లైన్‌ పేమెంట్ల ద్వారా తీసుకుంది. అయితే పూజలు చేసి అయిదు నెలలు గడుస్తున్నా కుటుంబ పరిస్థితులు చక్కబడకపోవడంతో సిరివెన్నెల, నిఖిల్‌లు నాగదేవిని నిలదీశారు. ఆమె నుంచి సరైన సమాధానం రాకపోవడంతో మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి, దర్యాపు చేస్తున్నామని జనగామ సీఐ తెలిపారు.

Updated Date - Nov 16 , 2024 | 05:22 AM