Hyderabad: ఎన్‌ఎంజీ వ్యాగన్లలో ఎలక్ట్రిక్ ఆటోల రవాణా..
ABN , Publish Date - Nov 16 , 2024 | 08:28 AM
ఎలక్ట్రిక్ ఆటో(Electric auto)లను రవాణా చేసేందుకు దక్షిణమధ్యరైల్వే ఎన్‌ఎంజీ (న్యూ మోడిఫైడ్ గూడ్స్) వ్యాగన్లను రూపొందించింది. బాలనగర్ స్టేషన్(Balanagar Station) నుంచి 25 వ్యాగన్లలో తొలిసారి 200 ఆటోలను ఢిల్లీ సమీపంలోని బిజ్వాసన్ స్టేషన్‌కు రవాణా చేశారు.
- బాలానగర్ స్టేషన్ నుంచి న్యూఢిల్లీకి
- సరుకు రవాణాలో హైదరాబాద్ డివిజన్ కృషికి జీఎం ప్రశంసలు
హైదరాబాద్ సిటీ: ఎలక్ట్రిక్ ఆటో(Electric auto)లను రవాణా చేసేందుకు దక్షిణమధ్యరైల్వే ఎన్‌ఎంజీ (న్యూ మోడిఫైడ్ గూడ్స్) వ్యాగన్లను రూపొందించింది. బాలనగర్ స్టేషన్(Balanagar Station) నుంచి 25 వ్యాగన్లలో తొలిసారి 200 ఆటోలను ఢిల్లీ సమీపంలోని బిజ్వాసన్ స్టేషన్‌కు రవాణా చేశారు. ఇందుకు గాను దక్షిణమధ్యరైల్వేకు రూ.17.50 లక్షల ఆదాయం సమకూరింది. ఎలక్ట్రిక్ ఆటోల లోడింగ్ ప్రక్రియను హైదరాబాద్ డీఆర్‌ఎం లోకేష్ విష్ణోయ్, సీనియర్ డీజీఎం అనిరుధ్ పామర్, ఆపరేషనల్ మేనేజర్ విద్యాధర్ పరిశీలించారు.
ఈ వార్తను కూడా చదవండి: Cyber criminals: పార్శిల్‌లో చట్టవ్యతిరేక వస్తువులంటూ బెదిరింపు రూ.6.90 లక్షలు కాజేశారు..
ఈ సందర్భంగా డీఆర్‌ఎం మాట్లాడుతూ.. సరుకు రవాణాను మెరుగుపరచడానికి దక్షిణమధ్యరైల్వే అనేక కార్యక్రమాలను చేపడుతోందని, వినియోగదారులను ఆకర్షించేందుకు విస్తృతమైన మార్కెటింగ్ ప్రయత్నాలను చేపడుతున్నామన్నారు. జడ్చర్ల సమీపంలోని రాజ్‌పూర్ కేఈటీవో మోటార్స్ ప్లాంట్ విజ్ఞప్తి మేరకు ఎలక్ట్రిక్ ఆటోలను రవాణాను విజయవంతంగా పూర్తి చేశామన్నారు.
ప్రయాణికుల కోచ్‌లను ఎన్‌ఎంజీ వ్యాగన్లుగా మార్చి వాటిని కార్లు, ఆటోలు, మోటార్ సైకిళ్లు, స్కూటర్లు తదితర తేలికపాటి వాహనాలను రవాణా చేయడానికి ఉపయోగించామన్నారు. సరుకు రవాణాను పెంపొందించడంలో హైదరాబాద్ డివిజన్ చేస్తున్న కృషిని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ అభినందించారు.
ఈవార్తను కూడా చదవండి: KTR: రేవంత్ ఓ రాబందు..
ఈవార్తను కూడా చదవండి: అయ్యప్ప భక్తుల కోసం మరో 4 ప్రత్యేక రైళ్లు
ఈవార్తను కూడా చదవండి: తగ్గిన ధరలకు బ్రేక్.. మళ్లీ పెరిగిన పుత్తడి రేట్లు
ఈవార్తను కూడా చదవండి: Treatment: మా అమ్మాయికి చికిత్స చేయించండి
Read Latest Telangana News and National News