Mancherial: గిరిజనుడిపై అటవీ శాఖ అధికారుల దాడి
ABN , Publish Date - Nov 18 , 2024 | 04:42 AM
చీపురు పుల్లల సేకరణకు అడవిలోకి వెళ్లిన గిరిజనుడిపై అటవీశాఖ అధికారులు దాడి చేసిన ఘటన మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం ది.
పోలీసులకు ఫిర్యాదు
వేమనపల్లి, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి) : చీపురు పుల్లల సేకరణకు అడవిలోకి వెళ్లిన గిరిజనుడిపై అటవీశాఖ అధికారులు దాడి చేసిన ఘటన మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం ది. కల్లెంపల్లి గ్రామానికి చెందిన బాధితుడు కుస్రం రవీందర్ ఆదివారం మాట్లాడుతూ.. తాను, ఆత్రం బక్కయ్య కలిసి ఈ నెల 15న చీపురు పుల్లల సేకరణకు అడవిలోకి వెళ్లామని తెలిపారు. అనంతరం లక్క కోసం ఓ మోదుగ చెట్టును నరుకుతుండగా అధికారులు బేగ్, పాషా తమపై దాడి చేయబోగా బక్కయ్య తప్పించుకుని పారిపోయాడన్నారు.
తనపై వారు కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారని తెలిపారు. కుష్నపల్లి రేంజ్ కార్యాలయానికి తీసుకెళ్లి తర్వాత వదిలేయడంతో ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్నానన్నాడు. ఆదివారం నీల్వాయి పోలీ్‌సస్టేషన్‌లో అధికారులపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆదివాసీ గిరిజన సంఘం ప్రధాన కార్యదర్శి ఎర్మ పున్నం మాట్లాడుతూ.. అటవీశాఖ అధికారులు గిరిజనుడిపై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.