Share News

TSSPDCL: టీఎస్ఎస్పీడీసీఎల్‌ యాప్‌లో కొత్త ఆప్షన్లు..

ABN , Publish Date - Apr 14 , 2024 | 09:34 AM

విద్యుత్‌ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలందించే దిశగా దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎ్‌సఎస్పీడీసీఎల్‌) యాప్‌ అప్‌డేట్‌ వెర్షన్‌ అందుబాటులోకి తెచ్చింది. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ యాప్‌(TSSPDCL App)లో కొత్త కనెక్షన్‌ కోసం దరఖాస్తు చేసుకోవడం మొదలు బిల్లు చెల్లింపు, గతేడాది మొత్తం వినియోగించిన యూనిట్లు, బిల్లింగ్‌ వివరాలు తెలుసుకోవచ్చు.

TSSPDCL: టీఎస్ఎస్పీడీసీఎల్‌ యాప్‌లో కొత్త ఆప్షన్లు..

హైదరాబాద్‌ సిటీ: విద్యుత్‌ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలందించే దిశగా దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ యాప్‌ అప్‌డేట్‌ వెర్షన్‌ అందుబాటులోకి తెచ్చింది. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ యాప్‌(TSSPDCL App)లో కొత్త కనెక్షన్‌ కోసం దరఖాస్తు చేసుకోవడం మొదలు బిల్లు చెల్లింపు, గతేడాది మొత్తం వినియోగించిన యూనిట్లు, బిల్లింగ్‌ వివరాలు తెలుసుకోవచ్చు. విద్యుత్‌ అంతరాయం, ఓల్టేజీ హెచ్చుతగ్గులు, ఇతర సరఫరా సమస్యలు, విద్యుత్‌మీటర్‌లో తలెత్తే సమస్యలు, మీటర్‌ కాలిపోతే ఫిర్యాదు, బిల్లింగ్‌ సమస్యలపై యాప్‌లోనే వినియోగదారులు ఫిర్యాదు చేసుకోవచ్చు. కొత్త విద్యుత్‌ కనెక్షన్లకు దరఖాస్తులు, కేటగిరీ మార్పు, గ్రీన్‌ టారిఫ్‌, సోలార్‌ రూఫ్‌ టాప్‌ కోసం యాప్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యుత్‌ చౌర్యంపై రిపోర్ట్‌ చేయడం, టారిఫ్‌ వివరాలు, సేఫ్టీ టిప్స్‌ వంటి వివరాలు యాప్‌లో చూసుకోవచ్చు. అప్‌డేట్‌ చేసిన యాప్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌(Google Play Store) నుంచి డౌన్‌లోడ్‌ చేసుకొని యూఎస్సీ నంబర్‌ నమోదు చేసుకుంటే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. యాప్‌ సేవలను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని, ఇప్పటికే యాప్‌ వాడుతున్న వినియోగదారులు కొత్త వెర్షన్‌ అప్‌డేట్‌ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: చల్లబడిన వాతావరణం.. మరో రెండు రోజులు ఇలాగే..

Updated Date - Apr 14 , 2024 | 09:34 AM

News Hub