Share News

Union Minister: ఎన్డీఏ కూటమికి 400కు పైగా స్థానాలు..

ABN , Publish Date - May 07 , 2024 | 10:41 AM

పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 400కు పైగా స్థానాలు వస్తాయని, నరేంద్రమోదీ(Narendra Modi) మరోసారి ప్రధాని అవడం ఖాయమని రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(ఎ) అధ్యక్షుడు, కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలే(Union Minister Ramdas Athawale) అన్నారు.

Union Minister: ఎన్డీఏ కూటమికి 400కు పైగా స్థానాలు..

- తెలుగు రాష్ర్టాలలో రెండు ఎంపీ స్థానాల్లో పోటీ

- అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కూటమికి మద్దతు

- ఆర్పీఐ అధ్యక్షుడు, కేంద్రమంత్రి రాందాస్‌ అథవాలే

హైదరాబాద్: పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 400కు పైగా స్థానాలు వస్తాయని, నరేంద్రమోదీ(Narendra Modi) మరోసారి ప్రధాని అవడం ఖాయమని రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(ఎ) అధ్యక్షుడు, కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలే(Union Minister Ramdas Athawale) అన్నారు. కేంద్రంలో బీజేపీ కూటమి మళ్ళీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు తొలగిస్తారంటూ వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ అగ్రనాయకుడు రాహుల్‌ గాంధీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్టు ఆయన తెలిపారు.

ఇదికూడా చదవండి: Telangana Rains: తెలంగాణకు గుడ్ న్యూస్.. అప్పటి వరకు వర్షాలు

మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌(Somajiguda Press Club)లో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ నాయకులు, అభ్యర్థులతో కలిసి ఆయన మాట్లాడారు. 2014 నుంచి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నామని అన్నారు. అప్పటి నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నానని, కేంద్రంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని తెలిపారు. దేశవ్యాప్తంగా ఆరు పార్లమెంట్‌ స్థానాల్లో తమ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని తెలిపారు. తెలుగు రాష్ర్టాలలో రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్నామని, పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కూటమికి మద్దతు తెలుపుతున్నామని వెల్లడించారు.

city2.2.jpg

ఇదికూడా చదవండి: CM Revanth Reddy : బై బై మోదీ!

తన పదవి కాలం ఇంకా ఉందని, అందుకే పార్లమెంట్‌ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదన్నారు. అస్సాంలో నాలుగు, తెలంగాణలో వరంగల్‌(Warangal), ఏపీలో విజయవాడ(Vijayawada) పార్లమెంట్‌ స్థానాల్లో పోటీ చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో మిగిలిన 16 పార్లమెంట్‌ స్థానాల్లో బీజేపీకి, ఏపీలోని 24 పార్లమెంట్‌, 175 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ, టీడీపీ కూటమి అభ్యర్థులకు మద్దతు తెలుపడమే కాకుండా వారి గెలుపుకోసం కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, వరంగల్‌ ఎంపీ అభ్యర్థి పి.రవికుమార్‌, ప్రధాన కార్యదర్శి వై.రత్న ప్రసాద్‌, ఏపీ అధ్యక్షుడు బ్రహ్మానందరెడ్డి, విజయవాడ అభ్యర్థి పేరం శివనాగేశ్వరరావు గౌడ్‌, జాతీయ నాయకుడు బి.నాగేశ్వరరావు, స్వామి, సంపత్‌ కుమార్‌, శ్రీధర్‌, తెలుగు రాష్ర్టాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: ప్రధాని రాక సందర్భంగా నేడు, రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు

Read Latest News and Telangana News Here

Read Latest National News and Telugu News

Updated Date - May 07 , 2024 | 10:41 AM