Share News

Nityanand Rai: ఉగ్రవాదం, మావోయిజాన్ని తుడిచిపెట్టేశాం

ABN , Publish Date - Sep 21 , 2024 | 03:51 AM

దేశంలో ఉగ్రవాదం, మావోయిజం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ అన్నారు.

Nityanand Rai: ఉగ్రవాదం, మావోయిజాన్ని తుడిచిపెట్టేశాం

  • మిగిలినట్లు గుర్తిస్తే కూకటివేళ్లతో పెకిలించండి

  • యువ ఐపీఎ్‌సలతో కేంద్రమంత్రి నిత్యానందరాయ్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు20 (ఆంధ్రజ్యోతి): దేశంలో ఉగ్రవాదం, మావోయిజం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ అన్నారు. ఎక్కడైనా ఇవి మిగిలిపోయినట్లు గుర్తిస్తే కూకటివేళ్లతో సహా పెకిలించాలని యువ ఐపీఎ్‌సలకు ఆయన పిలుపునిచ్చారు. నేరాల కట్టడిలో భాగంగా నిందితుల కంటే రెండడుగులు ముందుగానే ఆలోచించి అడ్డుకోవాలన్నారు. సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జాతీయ పోలీసు అకాడమీలో శుక్రవారం నిర్వహించిన దీక్షాంత్‌ పరేడ్‌లో 76వ ఆర్‌ఆర్‌ (రెగ్యులర్‌ రిక్రూటీ్‌స)బ్యాచ్‌కు చెందిన 188 మంది ప్రొబేషనరీ ఐపీఎ్‌సలు, భూటాన్‌, మాల్దీవులు సహా స్నేహపూర్వక దేశాలకు చెందిన 19 మంది అధికారులు పా ల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి నిత్యానందరాయ్‌.. ప్రొబేషనరీ అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశసేవే లక్ష్యంగా వృత్తి జీవితంలో కొనసాగాలన్నారు. నేషనల్‌ పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌ అమిత్‌గార్గ్‌ మాట్లాడుతూ.. వివిధ రంగాల్లో సైద్ధాంతిక, ప్రాక్టికల్‌ శిక్షణతోపాటు నూతన నేర చట్టాలు, సైబర్‌ నేరాల నియంత్రణ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి వాటిలోనూ శిక్షణ అందించినట్లు చెప్పారు. కాగా బెస్ట్‌ ఔట్‌డోర్‌ ప్రొబేషనర్‌గా నిలిచిన విశ్వజీత్‌ శౌర్యన్‌కు ఐపీఎస్‌ అసోసియేషన్‌ గౌరవ ఖడ్గాన్ని కేంద్ర మంత్రి బహూకరించారు. నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ యూనివర్సిటీ ట్రోఫీ ఫర్‌ పోలీస్‌ సైన్స్‌ పతకాన్ని అచ్యుత్‌ అశోక్‌కు, మణిపూర్‌ కప్‌ ఆఫ్‌ లా పతకాన్ని సోనాలి మిశ్రా, టాప్‌కప్‌ ఆఫ్‌ ఎక్యుటేషన్‌ పతకాన్ని ఆయుష్‌ యాదవ్‌, ఉత్తమ ప్రతిభ కనబర్చిన విదేశీ అధికారుల్లో రాయల్‌ భూటాన్‌ పోలీ్‌సకు చెందిన లెఫ్టినెంట్‌ కింగ్నా షైరీ, రాయల్‌ భూటాన్‌ పోలీ్‌సకు చెందిన లెఫ్టినెంట్‌ ఫుంషోవోలకు పతకాలు అందజేశారు.

Updated Date - Sep 21 , 2024 | 03:51 AM