Uttam: ప్రాధాన్య ప్రాజెక్టుల పనులు పరుగు పెట్టాలి
ABN , Publish Date - Nov 26 , 2024 | 03:22 AM
ప్రాధాన్య సాగునీటి ప్రాజెక్టుల పనులు నిర్ణీత గడువులోగా పూర్తిచే యాలని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రాజెక్టుల పనులకు పరిపాలనపరమైన అనుమతుల జారీ, ఇతర నిర్ణయాల్లో అధికారులు ఎలాంటి జాప్యం చేయరాదని ఆదేశించారు.
నిర్ణీత గడువులోగా పూర్తికావాలి
సీతారామ టెండర్ల ప్రక్రియను పూర్తిచేయాలి: మంత్రి ఉత్తమ్
ప్రాధాన్య సాగునీటి ప్రాజెక్టుల పనులు నిర్ణీత గడువులోగా పూర్తిచే యాలని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రాజెక్టుల పనులకు పరిపాలనపరమైన అనుమతుల జారీ, ఇతర నిర్ణయాల్లో అధికారులు ఎలాంటి జాప్యం చేయరాదని ఆదేశించారు. రాష్ట్ర వ్యవసాయ, ఆర్థిక రంగాల అభివృద్ధికి ప్రాజెక్టులు ఎంతో కీలకమని, వాటిని నిర్దేశిత గడువుల్లోగా పూర్తిచేసేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోందన్నారు. సీతారామ ప్రాజెక్టు కాల్వలు, డిస్ట్రిబ్యూటరీల పనులకు టెండర్ల ప్రక్రియను వేగవంతం చేసి పనులను సత్వరం ప్రారంభించాలని కోరారు.
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై సోమవారం ఆయన జలసౌధ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్షేత్రస్థాయిలోని అధికారులతో సమీక్ష నిర్వహించారు. మొడికుంట వాగు ప్రాజెక్టు అంచనా వ్యయం తయారీ, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియలో పురోగతిని అడిగి తెలుసుకున్నారు. భూసేకరణలో అడ్డంకులను అధిగమించడానికి పునరావాసం, పునర్‌నిర్మాణ విభాగం కమిషనర్ వినయ్‌కృష్ణా రెడ్డితో కలిసి పనిచేయాలని కోరారు. జలాశయాల్లో పూడిక తొలగింపు కోసం అవ సరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. నీటిపారుదల శాఖలో లష్కర్‌ల నియామకం, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ఎంపిక తదితర అంశాలపై సమీక్షలో చర్చించారు.