Share News

గ్రామీణ-పట్టణ ప్రాంతాల అంతరం తగ్గించేందుకు కృషి

ABN , Publish Date - Nov 13 , 2024 | 05:48 AM

గ్రామీణ-పట్టణ ప్రాంతాల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు యువత కృషి చేయాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా యువతను సన్నద్ధం చేయాల్సిన బాధ్యతను విశ్వవిద్యాలయాలు తీసుకోవాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.

గ్రామీణ-పట్టణ ప్రాంతాల అంతరం తగ్గించేందుకు కృషి

  • యువతకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య పిలుపు

  • ఘనంగా వీఐటీ నాలుగు దశాబ్దాల వేడుకలు

వేలూరు, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ-పట్టణ ప్రాంతాల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు యువత కృషి చేయాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా యువతను సన్నద్ధం చేయాల్సిన బాధ్యతను విశ్వవిద్యాలయాలు తీసుకోవాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం తమిళనాడులో వేలూరులోని ‘వేలూరు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’ (వీఐటీ) నాలుగు దశాబ్దాల వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్య పలువురు విద్యార్థులకు పురస్కారాలను అందజేశారు. అదేవిధంగా వీఐటీ ప్రాంగణంలో నిర్మించిన ఆర్‌జీ టవర్‌, సరోజిని నాయుడు బ్లాక్‌లను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యతో పాటు ఆరోగ్య సేవలను ఉచితంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలని సూచించారు. 40 ఏళ్ల క్రితం ఓ కళాశాలగా ప్రారంభమైన వీఐటీ విశ్వవిద్యాలయం అందుకు నిదర్శనంగా నిలుస్తుందని, ఈ స్ఫూర్తిని భవిష్యత్తు తరాలు అందిపుచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వీఐటీ చాన్స్‌లర్‌ డాక్టర్‌ జి.విశ్వనాథన్‌తో పాటు తమిళనాడు మంత్రి దురైమురుగన్‌, వీఐటీ ఉపాధ్యక్షులు శంకర్‌ విశ్వనాఽథన్‌, డాక్టర్‌ శేఖర్‌ విశ్వనాఽథన్‌, డాక్టర్‌ జీవీ సెల్వం, ఈడీ డాక్టర్‌ సంధ్య పి, అసిస్టెంట్‌ వైస్‌ప్రెసిడెంట్‌ కాదంబరి ఎస్‌.విశ్వనాఽథన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2024 | 05:48 AM