Home » Venkaiah Naidu
విజయవాడలో ఈ నెల 14న దివంగత ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ సభ జరగనుంది. దీనికి ముఖ్య అతిఽథులుగా సీఎం చంద్రబాబు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరు కానున్నారు.
గ్రామీణ-పట్టణ ప్రాంతాల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు యువత కృషి చేయాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా యువతను సన్నద్ధం చేయాల్సిన బాధ్యతను విశ్వవిద్యాలయాలు తీసుకోవాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.
విశాఖపట్నం అందమైన నగరమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. ఆహార అలవాట్లు, జీవన విధానం , ఒత్తిడితో డయాబెటిస్ బారిన పడుతున్న వారు పెరుగుతున్నారని చెప్పారు. ప్రజల జీవన విధానాన్ని మార్చుకోవాలని సూచించారు.
మిల్లర్ల సమస్యలు పరిష్కారించడానికి కృషి చేస్తానని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఏ వస్తువుల ఎగుమతిపై లేని నిబంధనలు.... ఒక్క పంటల ఎగుమతి పైనే ఎందుకని ప్రశ్నించారు.
మాటల్లో చమత్కారాలూ, విరుపులూ, మెరుపులూ, ప్రాసలూ అలవోకగా జాలువారే వెంకయ్య నాయుడి వాగ్ధాటి అందరికీ తెలుసు. తెలిసిన సంగతులు పక్కనబెట్టి ఆయన జీవిత కథను చిత్రాల్లో చెప్పటంలో విజయం సాధించిన అందమైన పుస్తకం ‘మహానేత’. భారత 13వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడి జీవితాన్ని దృశ్య కావ్యంగా మలిచారు సంజయ్ కిషోర్.
ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు భారతీయ తత్వచింతనే పరిష్కారమని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు.
కాస్మాలజీ, మెటా ఫిజిక్స్ వంటి శాస్త్రాలు కూడా మన తత్వాల్లో ఉన్నాయని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. ఆచార్య నాగార్జునుడు, ఆది శంకరాచార్యులు తాత్వికతను ప్రముఖంగా చెప్పారని గుర్తుచేశారు. వేమన శతకం చదివితే అద్భుతమైన ప్రాపంచిక చింతన అలవడుతుందని తెలిపారు.
Telangana: ఖైరతాబాద్ మహా గణనాధునికి ఆరో రోజు పూజలు కొనసాగుతున్నాయి. శ్రీ సప్తముక మహాగణపతికి ఆరో రోజు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఈరోజు (గురువారం) ఖైరతాబాద్ ఉత్సవాలకుమాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. వెంకయ్య నాయుడితో ఉత్సవ సమితి సభ్యులు ప్రత్యేక పూజలు చేయించారు.
తెలుగు రాష్ర్టాల్లో వరద కష్టాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో వరద కష్టాలపై భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు. తనకు వచ్చే పెన్షన్ నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి విరాళం ప్రకటించారు. తన కుమారుడు, కుమార్తె తరఫున కూడా విరాళం ప్రకటించారాయన.