YS Viveka Murder Case: ఉదయ్‌కుమార్‌రెడ్డి బెయిల్ పిటిషన్.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
ABN , Publish Date - Aug 14 , 2024 | 08:00 PM
వివేక హత్య కేసులో నిందితుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి.. సాక్షులను ప్రభావితం చేయడమే కాకుండా బెదిరింపులకు సైతం పాల్పడ్డాడని తెలంగాణ హైకోర్టుకు సీబీఐ స్పష్టం చేసింది. అదీకాక ఇదే హత్య కేసులో దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్లు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని సునీత తరుపు న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు.
హైదరాబాద్, ఆగస్ట్ 14: వివేక హత్య కేసులో నిందితుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి.. సాక్షులను ప్రభావితం చేయడమే కాకుండా బెదిరింపులకు సైతం పాల్పడ్డాడని తెలంగాణ హైకోర్టుకు సీబీఐ స్పష్టం చేసింది. అదీకాక ఇదే హత్య కేసులో దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్లు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని సునీత తరుపు న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు. ఇటువంటి పరిస్థితుల్లో గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయవద్దని హైకోర్టను వైఎస్ సునీతతోపాటు సీబీఐ అభ్యర్థించింది. బుధవారం తెలంగాణ హైకోర్టులో వివేక హత్య కేసులో నిందితుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగింది.
Also Read: Rajya Sabha by-election: తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీ
వైఎస్ సునీత ఇంప్లీడ్..
ఉదయ్ కుమార్ పిటిషన్‌లో వైఎస్ సునీత రెడ్డి ఇంప్లీడ్ అయ్యారు. ఈ బెయిల్ పిటిషన్‌పై ఇరు వాదనలు ముగిశాయి. దీంతో తీర్పును తెలంగాణ హైకోర్టు రిజర్వ్ చేసింది. ఇక ఈ కేసులో నిందితులు A-6 ఉదయ్ కుమార్ రెడ్డికి, A-7 భాస్కర్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కోర్టు దృష్టికి సీబీఐ తరుపు న్యాయవాది తీసుకు వెళ్లారు. ఇప్పటికే పిటిషనర్ మూడు సార్లు బెయిల్ పిటిషన్లు దాఖలు చేస్తే.. న్యాయస్థానం మూడుసార్లు తిరస్కరించిందని సీబీఐ న్యాయవాది ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Also Read: United Nations: యూఎన్‌లో శాశ్వత ప్రతినిధిగా హరీశ్ పర్వతనేని నియామకం
2019, మార్చి 15 తెల్లవారుజామున..
2019 మార్చి15వ తేదీ తెల్లవారుజామున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సొంత చిన్నాన్నా వైఎస్ వివేకానందరెడ్డి.. పులివెందుల్లోని తన నివాసంలో దారుణంగా హత్యకావించ బడ్డారు. సరిగ్గా ఎన్నికలకు కొద్ది రోజులు ముందు కావడంతో ఈ హత్యకు వైఎస్ జగన్ రాజకీయ రంగు పులిమారు. ఈ దారుణ హత్య వెనుక నాటి టీడీపీ ప్రభుత్వ ఉందంటూ ఆరోపణలు గుప్పించారు. ఈ కేసు సీబీఐకి అప్పగిస్తేనే పాత్రదారులు, సూత్రధారులు బయటకు వస్తారంటూ ప్రచారం సైతం చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్ సైతం దాఖలు చేశారు. ఆ క్రమంలో జరిగిన ఆ ఎన్నికల్లో ఆంధ్రా ఓటరు వైఎస్ జగన్ పార్టీకి పట్టం కట్టారు.
Also Read: Air India Flight : బయలుదేరిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక సమస్య..
Also Read: Kolkata RG Kar Hospital: ట్రైయినీ వైద్యురాలి పోస్ట్‌మార్టం నివేదికలో సంచలన విషయాలు
కొలువు తీరిన జగన్ ప్రభుత్వం.. మడమ తిప్పిన సీఎం
దీంతో వైఎస్ జగన్ ప్రభుత్వం కొలువు తిరింది. ఆ వెంటనే వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ కోర్టులో వేసిన పిటిషన్‌ను వైఎస్ జగన్ వెనక్కి తీసుకున్నారు. మరోవైపు వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే.. తన తండ్రి హత్య కేసు కేవలం రోజుల్లోనే ఛేదిస్తారంటూ వైఎస్ వివేకా కుమార్తె వైఎస్ సునీత ఆకాంక్షించారు. కానీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ గద్దెనెక్కిన తర్వాత.. ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టలేదు.
Also Read: Jammu Kashmir Encounter: ఆర్మీ అధికారి మృతి, నలుగురు ఉగ్రవాదులు హతం..!
Also Read: Rachakonda CP: రియాజ్‌ను హత్య చేస్తే.. డాన్ అవుతాడనుకున్న హమీద్
వైఎస్ సునీత పోరాటంతో.. అప్రూవర్‌గా మారిన దస్తగిరి..
దీంతో వైఎస్ వివేకా హత్య కేసు సీబీఐకి అప్పగించాంటూ ఆయన కుమార్తె వైఎస్ సునీత.. న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో ఈ కేసు సీబీఐకి అప్పగించాలంటూ కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు.. సీబీఐ చేతిలోకి వెళ్లిన అనంతరం వివేకా మాజీ కారు డ్రైవర్ దస్తగిరి అప్రూవర్‌గా మారారు. దీంతో ఈ హత్య కేసులో పాత్రదారులు, సూత్రధారులు ఎవరో కళ్లకు కట్టినట్లు వివరించారు. దీంతో ఈ కేసు సాధ్యమైనంత త్వరలో ఓ కొలిక్కి వస్తుందని అంతా భావించారు. కానీ ఈ కేసు సీబీఐ చేతిలోకి వెళ్లినా.. దర్యాప్తు మాత్రం నాలుగడుగులు ముందుకు వేస్తే.. రెండడుగులు వెనక్కి అన్నట్లుగా పడుతుంది.
Read More National News and Latest Telugu News