Share News

Delhi: ఢిల్లీకి ‘లగచర్ల’ బాధిత రైతుల కుటుంబసభ్యులు

ABN , Publish Date - Nov 18 , 2024 | 03:16 AM

లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో అరెస్టయిన బాధిత రైతుల కుటుంబాల సభ్యులు తమపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు ఆదివారం ఢిల్లీకి చేరుకున్నారు.

Delhi: ఢిల్లీకి ‘లగచర్ల’ బాధిత రైతుల కుటుంబసభ్యులు

  • నేడు ఎస్సీ, ఎస్టీ, మానవ హక్కుల కమిషన్లకు ఫిర్యాదు

బొంరా్‌సపేట్‌, వికారాబాద్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో అరెస్టయిన బాధిత రైతుల కుటుంబాల సభ్యులు తమపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు ఆదివారం ఢిల్లీకి చేరుకున్నారు. సోమవారం జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కలిసి రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులపై వారు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. వారి వెంట సత్యవతి రాథోడ్‌, బీఆర్‌ఎస్‌ నేతలు తరలివెళ్లారు. కాగా సోమవారం జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యుడు హుస్సేన్‌.. లగచర్లకు రానున్నట్లు సమాచారం.


అలాగే రాష్ట్ర బీజేపీ నేదలు కూడా లగచర్లకు రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, లగచర్ల కేసులో అరెస్టయిన పట్నం నరేందర్‌రెడ్డికి బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ గురువారం బీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ వికారాబాద్‌ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ జరగనుంది. అలాగే నరేందర్‌రెడ్డి కస్టడీ కోరుతూ కొడంగల్‌ కోర్టులో పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పైనా ఈ రోజే విచారణ జరగనుంది.

Updated Date - Nov 18 , 2024 | 03:16 AM