Share News

Donations: కుమారీ ఆంటీ రూ.50 వేల విరాళం

ABN , Publish Date - Sep 19 , 2024 | 04:25 AM

రోడ్డు పక్కన చిన్న షెడ్డులో హోటల్‌ నడుపుతూ పేరు తెచ్చుకుని సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన కుమారి అలియాస్‌ కుమారీ ఆంటీ తన పెద్దమనసును చాటుకున్నారు.

Donations: కుమారీ ఆంటీ రూ.50 వేల విరాళం

  • వరద బాధితుల సహాయార్థం సీఎంకు చెక్కు అందజేత

  • రేవంత్‌కు రొయ్యలు, నాటుకోడి కూర ఇచ్చిన కుమారి

హైదరాబాద్‌, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): రోడ్డు పక్కన చిన్న షెడ్డులో హోటల్‌ నడుపుతూ పేరు తెచ్చుకుని సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన కుమారి అలియాస్‌ కుమారీ ఆంటీ తన పెద్దమనసును చాటుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వరద బాధితుల సహాయార్థం రూ.లక్ష విరాళం ప్రకటించారు. బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిసిన కుమారి కుటుంబం రూ.50వేల చెక్కును అందించింది. సీఎం రేవంత్‌ ఆమెను అభినందించి, శాలువాతో సన్మానించారు. కుమారి హైదరాబాద్‌లోని రాయదుర్గం ఐటీ హబ్‌ ప్రాంతంలో నడుపుతున్నారు. ఆమె కుటుంబానికి ఆ హోటలే జీవనాధారం.


నిజానికి తామే అప్పుల్లో ఉన్నా... ‘అప్పులు ఎప్పుడూ ఉంటాయి.. సాయం చేసేది ఒకసారే కదా అమ్మా’ అని తన పిల్లలు అన్నారని ఆమె ‘ఆంధ్రజ్యోతి’తో చెప్పారు. ఇంకొంచెం ఎక్కువ కష్టపడదామన్నారని తెలిపారు. కాగా సీఎంకు ఆమె రొయ్యల వేపుడు, నాటుకోడి, చేపల కూర, మటన్‌ కర్రీ, బిర్యానీ అందజేశారు. గతంలో తన హోటల్‌ను తీసేయాలని పోలీసులు చెప్పినప్పుడు తమకు సీఎం అండగా ఉన్నారని ఆమె గుర్తు చేసుకున్నారు. ఏపీ పెద్దలకు సమాచారం అందించామని, వారి నుంచి పిలుపు రాగానే వెళ్లి రూ.50వేల చెక్కు అందిస్తామని తెలిపారు.

Updated Date - Sep 19 , 2024 | 04:25 AM