Home » Kumari Aunty
ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు హైదరాబాద్‌లో స్ట్రీట్ ఫుడ్ వ్యాపారంతో ఫేమస్ అయిన కుమారి అంటీ రూ. 50 వేల విరాళం ఇవాళ(సోమవారం) అందజేశారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో కలిసి సీఎం చంద్రబాబుకు కుమారి ఆంటీ చెక్కు అందచేశారు.
కుమారీ ఆంటీ.. ఈపేరు పరిచయమక్కర్లేదు. హైదరాబాద్‌లో రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్ పెట్టుకుని బిజినెస్ చేసుకుంటూ సోషల్ మీడియా పుణ్యమా అని ఒక్కసారిగా ఫేమస్ అయిపోయారు.
రోడ్డు పక్కన చిన్న షెడ్డులో హోటల్ నడుపుతూ పేరు తెచ్చుకుని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన కుమారి అలియాస్ కుమారీ ఆంటీ తన పెద్దమనసును చాటుకున్నారు.
ఐటీ కారిడార్‌లో బాలీవుడ్ హీరో సోనుసూద్(Bollywood hero Sonusood) సందడి చేశారు. మీది మొత్తం వెయ్యి రూపాయలు.. రెండు లివర్లు ఎగస్ర్టా అనే డైలాగ్‌తో సోషల్ మీడియాలో స్టార్‌గా మారిన కుమారీ ఆంటీ ఫుడ్ కోర్టును శుక్రవారం సోనుసూద్ అనుకోకుండా సందర్శించారు.
కుమారి ఆంటీ.. తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. రాత్రికి రాత్రి ఆమె ఫుల్ ఫేమస్ అయిపోయింది. ఆ తర్వాత నుంచి ఆమె తరచు సోషల్ మీడియాలో అడపా దడపా కనిపిస్తున్నారు. అయితే కుమారి ఆంటీ తాజాగా గుడివాడలో ఎన్నికల ప్రచారంలో ప్రత్యక్షమయ్యారు.
Kumari Aunty Dialogue: కుమారి ఆంటీ (Kumari Aunty).. ఇప్పుడీ పేరు తెలియని వారు బహుశా ఉండరేమో.! యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్.. ఇలా ఏది ఓపెన్ చేసినా సరే కుమారి ఆంటీ.. ఆంటీ.. వాయిస్, వీడియోలే కనిపిస్తుంటాయ్.! హైదరాబాద్‌లోని (Hyderabad) మాదాపూర్ ఏరియాలో రోడ్డుపై మీల్స్ అమ్మే.. సామాన్యురాలు కుమారి.. ఒకే ఒక్క డైలాగ్‌తో ఫేమస్ అయిపోయింది. ‘మీది మొత్తం థవ్‌జండ్ (వెయ్యి రూపాయిలు).. రెండు లివర్లు ఎక్స్ట్రా’ (2 Livers Extra) అని ఆంటీ చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాను (Social Media) షేక్ చేశాయి...