Share News

Warangal: భద్రకాళీ అమ్మవారి శాకంబరీ ఉత్సవాలు

ABN , Publish Date - Jul 21 , 2024 | 11:37 AM

వరంగల్: వరాలనిచ్చే చల్లనితల్లి.. ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం.. ఆషాఢంలో ఆరంభపూజలు అందుకునే శక్తిస్వరూపిని.. భద్రకాళి అమ్మవారి దేవాలయంలో శాకంబరి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి భద్రకాళీ అమ్మవారిని తొలి దర్శనం చేసుకున్నారు.

Warangal: భద్రకాళీ అమ్మవారి  శాకంబరీ ఉత్సవాలు

వరంగల్: వరాలనిచ్చే చల్లనితల్లి.. ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం.. ఆషాఢంలో ఆరంభపూజలు అందుకునే శక్తిస్వరూపిని.. భద్రకాళి అమ్మవారి దేవాలయం (Bhadrakali Ammavari Temple)లో శాకంబరి ఉత్సవాలు (Sakambari Festivals) అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి (MLA Nayini Rajender Reddy) భద్రకాళీ అమ్మవారిని తొలి దర్శనం చేసుకున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. 10 టన్నుల కూరగాయలు, ఆకు కూరలు, పండ్లతో అమ్మవారిని అలంకరించారు. శాకంబరీ అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. వర్షం పడుతున్నా.. భక్తులు తడుస్తూ క్యూలైన్లలో నిల్చున్నారు.


అంకురార్పణతో ప్రారంభమైన ఈ ఉత్సవాలు శాకాంబరితో ముగుస్తాయని ఆలయ ప్రధాన అర్చకుడు తెలిపారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయ ప్రాంగణానికి పోటెత్తారు. భద్రకాళీ శరణం అంటూ భక్తులు చేసిన అమ్మవారి నామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగుతోంది.


భద్రకాళి అమ్మవారిని కూరగాయలతో అలంకరించి ఆరాధించడంవల్ల కరువుకాటకాలు దరిచేరవని, కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఆషాఢశుద్ద పాడ్యమినాడు ప్రారంభమయ్యే శాకంబరీ ఉత్సవాలు పౌర్ణమి వరకు జరుగుతాయి. శాకంబరీ ఉత్సవాల సమయంలో ఒక్కసారైనా అమ్మవారిని దర్శించుకుని కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా ఆ కోరికలు నెరవేరుతాయని భక్తులు ప్రగాఢవిశ్వాసం.


ఈ వార్తలు కూడా చదవండి..

శ్రీగంధంలో అప్పన్న స్వామి భక్తులకు దర్శనం

ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద భక్తుల రద్దీ

అఖిలపక్ష సమావేశం నేడు..

నేడు ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి

శాంతి అవినీతిపై ఆరా!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 21 , 2024 | 11:37 AM