Sammakka Sarakka: మేడారానికి పోటెత్తిన భక్తులు
ABN , Publish Date - Feb 11 , 2024 | 10:00 AM
ములుగు జిల్లా: మేడారానికి భక్తులుపోటెత్తారు. ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు వన దేవతల చెంతకు భక్తులు తరలి వస్తున్నారు. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. తెలంగాణ కుంభమేళాగా పేరు గాంచిన మేడారం సమక్క - సారలమ్మ జాతర ఈనెల 21 నుంచి ప్రారంభంకానుంది.
ములుగు జిల్లా: మేడారానికి భక్తులుపోటెత్తారు. ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు వన దేవతల చెంతకు భక్తులు తరలి వస్తున్నారు. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. తెలంగాణ కుంభమేళాగా పేరు గాంచిన మేడారం సమక్క - సారలమ్మ జాతర ఈనెల 21 నుంచి ప్రారంభంకానుంది. జాతర తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
కాగా జిల్లా కేంద్రంలోని గోదావరి తీరంలో నిర్వహించనున్న సమ్మక్క- సారలమ్మ జాతర ఏర్పాట్లను శనివారం మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య, వైస్‌చైర్మన్ సల్ల మహేష్, కమిషనర్ మారుతి ప్రసాద్ పరిశీలించారు. ప్రత్యేక నిధులతో గద్దెల వద్ద ప్లాట్‌ఫాంల నిర్మాణాలను, మంచినీటి సరఫరా పనులను సమీక్షించారు. కౌన్సిలర్లు అనిత రవీందర్‌రావు, శ్వేతరమేష్, ఎంఈ మధుకర్ పాల్గొన్నారు.
15న సమ్మక్క సారక్క వేలం పాటలు
మందమర్రి పట్టణంలోని పాలవాగు ఒడ్డున ఈనెల 21 నుంచి 24 వరకు సింగరేణి యాజమాన్యం నిర్వహించే సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి దుకాణాల వేలంపాటలు ఈ నెల 15న నిర్వహిస్తున్నామని జాతర కమిటీ వారు తెలిపారు. కొబ్బరికా యలు, వాహన పార్కింగ్, బెల్లం తూకాలు, ఇతర దుకాణాలు జాతరలో ఏర్పాటు చేసుకునే వారు 10 గంటలకు వెంకటేశ్వర ఆలయంలో హాజరు కావాలని తెలిపారు. వేలంలో పాల్గొని దుకాణాలను కైవసం చేసుకోవచ్చని, చిన్న దుకాణాలు పెట్టుకోదల్చిన వారు రూ.1000 చెల్లించి టోకెన్ తీసుకున్న వారికి అనుమతి ఇస్తామని తెలిపారు.