Medaram Jatara: మేడారం మహాజాతరలో నేడు మండమెలిగే పండగ
ABN , Publish Date - Feb 14 , 2024 | 06:55 AM
ములుగు జిల్లా: మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరలో భాగంగా నిర్వహించే క్రతువుల్లో మరో ప్రధాన ఘట్టానికి బుధవారం అంకురార్పణ జరుగనుంది. ఈరోజు ఉదయం మండమెలిగే పండగ నిర్వహించనున్నారు.
ములుగు జిల్లా: మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరలో భాగంగా నిర్వహించే క్రతువుల్లో మరో ప్రధాన ఘట్టానికి బుధవారం అంకురార్పణ జరుగనుంది. ఈరోజు ఉదయం మండమెలిగే పండగ నిర్వహించనున్నారు. సమ్మక్క కొలువైన మేడారం, సారలమ్మ ఉన్న కన్నెపల్లి, కొండాయిలోని గోవిందరాజులు, పూనుగొండ్లలోని పగిడిద్దరాజు గుడుల శుద్ది కార్యక్రమం జరుగుతుంది. పుట్టమట్టితో గుడులు అలికి... మామిడి తోరణాలతో అలంకరణ చేస్తారు. అనంతరం మేడారంలోని సమ్మక్క ప్రధాన పూజారి ఇంటి నుంచి డప్పుచప్పుళ్లు, డోలు వాయిద్యాల నడుమ పసుపు, కుంకుమలతో మేడారం చుట్టూ ఊరేగింపు నిర్వహిస్తారు. అక్కడి నుంచి సమ్మక్క గుడికి వెళ్లి గిరిజన ఆడపడుచులు పూజలు చేస్తారు. ఆ తరువాత గ్రామ బొడ్రాయికి శుద్ధ జలంతో అభిషేకాలు చేస్తారు. ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో మేడారం సందడిగా మారింది.