Share News

Hanumakonda: ఇంటర్ మెుదటి సంవత్సరం విద్యార్థిని ఆత్మహత్య.. విషయం ఇదే..

ABN , Publish Date - Dec 25 , 2024 | 08:31 AM

ఏకశిలా జూనియర్ కళాశాల (Ekashila Junior College) బాలికల క్యాంపస్‌లో దారుణం ఘటన చోటు చేసుకుంది. ఇంటర్మీడియెట్ ( Intermediate) మెుదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని శ్రీదేవి(Sridevi) హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

Hanumakonda: ఇంటర్ మెుదటి సంవత్సరం విద్యార్థిని ఆత్మహత్య.. విషయం ఇదే..
Student Sridevi passed away

హనుమకొండ: ఏకశిలా జూనియర్ కళాశాల (Ekashila Junior College) బాలికల క్యాంపస్‌లో దారుణం ఘటన చోటు చేసుకుంది. ఇంటర్మీడియెట్ (Intermediate) మెుదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని శ్రీదేవి (Sridevi) హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే బాలిక తల్లిదండ్రులు, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా పోస్టుమార్టం నిర్వహించేందుకు కళాశాల సిబ్బంది బాలిక మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.

Allu Arjun: తప్పయిపోయింది!


ఘటన గురించి తెలుసుకున్న విద్యార్థి సంఘాలు కళాశాల ఎదుట మంగళవారం అర్దరాత్రి పెద్దఎత్తున ఆందోళనకు దిగాయి. విద్యార్థిని మృతికి యాజమాన్యమే కారణంటూ విద్యార్థి సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. మేనేజ్మెంట్ ఒత్తిడి వల్లే శ్రీదేవి మృతిచెందిందంటూ నినాదాలు చేశారు. అనుమతి లేకుండా కళాశాల నిర్వహిస్తున్నారని, కాలేజీ ఛైర్మన్ తిరుపతి రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Hyderabad: వర్గీకరణ అమలుకు పోరాడదాం.. వ్యతిరేక కుట్రలను ఎదుర్కొందాం


కాగా, మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఘటన జరిగితే విషయం బయటకు పొక్కకుండా కళాశాల యాజమాన్యం మేనేజ్ చేసిందంటూ విద్యార్థి నేతలు ఆరోపిస్తున్నారు. ఘటనపై ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. బాలిక ఎందుకు ఆత్మహత్య చేసుకుంది, యువతి తల్లిదండ్రులు, పోలీసులకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించాల్సిన అవసరం ఏంటి?, ఆత్మహత్యకు వ్యక్తిగత కారణాలా లేక మరేదైనా కారణమా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. కుమార్తె మృతిచెందడంపై తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. శ్రీదేవి మృతికి కారణాలు చెప్పాలంటూ కళాశాల యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

CM Chandrababu: సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ వివరాలు ఇవే..

Today Gold Rates: గుడ్ న్యూస్.. నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Dec 25 , 2024 | 10:23 AM