Share News

CM Revanth Reddy: మహిళలకు పీసీసీ ఇస్తే ఎలా ఉంటుంది.. రేవంత్ రెడ్డి అభిప్రాయమిదే

ABN , Publish Date - Jun 28 , 2024 | 06:46 PM

టీపీసీసీ పదవిని మహిళకు ఇస్తే ఎలా ఉంటుంది? ఇదే ప్రశ్నను ఓ విలేకరి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వద్ద ప్రస్తావించగా.. సీఎం ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

CM Revanth Reddy: మహిళలకు పీసీసీ ఇస్తే ఎలా ఉంటుంది.. రేవంత్ రెడ్డి అభిప్రాయమిదే

హైదరాబాద్: టీపీసీసీ పదవిని మహిళకు ఇస్తే ఎలా ఉంటుంది? ఇదే ప్రశ్నను ఓ విలేకరి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వద్ద ప్రస్తావించగా.. సీఎం ఆసక్తికర సమాధానం ఇచ్చారు. హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. మహిళలకు పీసీసీ పదవి ఇస్తే బాగానే ఉంటుందని స్పష్టం చేశారు


"పీసీసీ రేసులో ఎవరైనా ఉండొచ్చు. సామాజిక న్యాయంలో భాగంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీలు, మహిళలు ఇలా ఏ వర్గానికి చెందిన వారైనా ఉండొచ్చు. ఫిరాయింపులు అంతటా జరుగుతున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో ఎమ్మెల్యేలు ఫిరాయించారు. గతంలో నలుగురు టీడీపీ ఎంపీలను బీజేపీ చేర్చుకుంది. ఉచిత పథకాలను తప్పుపట్టడం సరికాదు. అవసరం ఉన్నవారికే సంక్షేమ పథకాలు అందాలి. ప్రధాని మోదీ గడిచిన10 ఏళ్లలో రూ.16 లక్షల కోట్లు కార్పొరేట్ కంపెనీలకు మాఫీ చేస్తే ప్రశ్నించే వారు లేరు. కానీ మహిళలు, రైతులు, పేదలకు రుణాలు మాఫీ చేయాలని చూస్తే తప్పుబడుతున్నారు" అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.

For Latest News and Telangana News click here..

Updated Date - Jun 28 , 2024 | 06:46 PM