Share News

పురాణపండ ‘ఉగ్రం ... వీరం’తో పరవశించిన యాదాద్రి.. ఎన్నో జన్మల పుణ్యమన్న ఈఓ భాస్కరరావు

ABN , Publish Date - May 22 , 2024 | 01:08 AM

గ్రంథ రచయిత , శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. యాదాద్రి మట్టిని తాకినప్పుడు కలిగే అనుభూతి ఒక ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, అభయాన్నిస్తుందని పేర్కొంటూ ఈ పవిత్ర గ్రంధాన్ని వేల ప్రతుల్లో ప్రచురించి మహా పుణ్య కార్యంగా భుజాలకెత్తుకున్న లక్ష్మయ్య, అరుణాదేవి దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే ఎన్నెన్నో శ్రీవైష్ణవ ఆలయాలకు ‘ఉగ్రం వీరం’ను చేరుస్తున్న ప్రచురణకర్త లక్ష్మయ్య ఆత్మ సమర్పణాభావాన్ని అభినందించారు.

పురాణపండ ‘ఉగ్రం ... వీరం’తో పరవశించిన యాదాద్రి.. ఎన్నో జన్మల పుణ్యమన్న ఈఓ భాస్కరరావు

యాదాద్రి, మే 22: యాదాద్రి, కదిరి, వేదాద్రి, సింహాచలం, ధర్మపురి, మంగళగిరి, అంతర్వేది, చేర్యాల, బీదర్, కోరుకొండ, ఆగిరిపల్లి, ఫణిగిరి... ఇలా ఎన్నో మహా నారసింహ క్షేత్రాలన్నీ శ్రీ నృసింహ జయంతితో స్వాతి నక్షత్ర మంగళవేళ పరవశిస్తున్న సందర్భంలో... యాదాద్రి ఉత్సవ సంరంభాల రెండవరోజున ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ పరమాద్భుత గ్రంధం ‘ఉగ్రం వీరం’ ను యాదాద్రి మహాక్షేత్ర స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ మరియు కార్యనిర్వహణాధికారి ఏ. భాస్కరరావు (Yadadri EO A Bhaskar Rao) మంగళవారం సాయంకాలం ప్రత్యేక వేదికపై ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా భాస్కరరావు మాట్లాడుతూ ఈ ‘ఉగ్రం వీరం’ (Ugram Veeram) గ్రంధమంతా ప్రహ్లాద నారసింహుల లావణ్యంతో నిండిన కథా స్తోత్ర పరిమళాలతో పురాణపండ శ్రీనివాస్ (Puranapanda Srinivas) గొప్ప సమ్మోహనంగా తీర్చిదిద్దడంతో ఎంతో ఆకట్టుకుంటోందన్నారు. తొలిప్రతిని ప్రముఖ గాయకులు, లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ ఫౌండర్ చైర్మన్ కొమండూరి రామాచారి (Komanduri Ramachari)కి అందజేశారు.

Ugram-Veeram.jpg

గ్రంథ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. యాదాద్రి మట్టిని తాకినప్పుడు కలిగే అనుభూతి ఒక ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, అభయాన్నిస్తుందని పేర్కొంటూ ఈ పవిత్ర గ్రంధాన్ని వేల ప్రతుల్లో ప్రచురించి మహా పుణ్య కార్యంగా భుజాలకెత్తుకున్న లక్ష్మయ్య, అరుణాదేవి దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే ఎన్నెన్నో శ్రీవైష్ణవ ఆలయాలకు ‘ఉగ్రం వీరం’ను చేరుస్తున్న ప్రచురణకర్త పొన్నాల లక్ష్మయ్య (Ponnala Lakshmaiah) ఆత్మ సమర్పణాభావాన్ని అభినందించారు.

ఈ శ్రీకార్యానికి యాదాద్రి మహాక్షేత్ర ప్రధాన అర్చకులు నల్లంతీగల్ లక్ష్మీనరసింహాచార్యులు మంగళాశాసనం చేశారు. ‘ఉగ్రం.. వీరం’ దివ్యగ్రంధాన్ని దేవస్థానం ఉప కార్యనిర్వహణాధికారి దోర్బల భాస్కరశర్మ పరిచయం చేశారు.

Puranapanda.jpg

లక్ష పుష్పార్చనలో పాల్గొన్న వందల భక్తులకు, సహస్ర కలశాభిషేకంలో పాల్గొన్న దంపతులకు, వివిధ ప్రత్యేక దర్శనాల్లో పాల్గొన్న భక్తులకు, దాతలకు ఈ మహత్తర గ్రంధాన్ని ఆలయ సిబ్బంది ఉచితంగా అందజేయడం విశేషం. యాదాద్రిలో ఇంతటి మహోజ్వల గ్రంధం ఈ ఉత్సవాల్లో ఆవిష్కరించబడటం శ్రీ లక్ష్మీనృసింహుని పరిపూర్ణకటాక్షమని దేవస్థాన మరొక ప్రధాన ఆచార్యులు కాండూరి వెంకటాచార్యులు పేర్కొన్నది మంగళసత్యం.

Updated Date - May 22 , 2024 | 11:39 PM