TG News: యాదగిరిగుట్ట లక్ష్మినరసింహ స్వామి ఆలయ ఈఓ బదిలీ
ABN , Publish Date - Mar 14 , 2024 | 06:29 PM
యాదగిరిగుట్ట లక్ష్మినరసింహ స్వామి ఆలయ ఇన్‌చార్జ్ ఈఓ రామకృష్ణరావుపై బదిలీ వేటు పడింది. ప్రోటోకాల్ విషయంపై నిర్లక్ష్యం చేశారని ఆలయ ఈవోని దేవాదాయ ధర్మాదాయ శాఖ బదిలీ చేసింది. యాదగిరిగుట్ట కొత్త ఆలయ ఈవోగా భాస్కర్ రావు నియమించారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగట్టన్ని సందర్శించారు.
యాదాద్రి : యాదగిరిగుట్ట లక్ష్మినరసింహ స్వామి ఆలయ ఇన్‌చార్జ్ ఈఓ రామకృష్ణరావుపై బదిలీ వేటు పడింది. ప్రోటోకాల్ విషయంలో నిర్లక్ష్యం చేశారని ఆలయ ఈవోని దేవాదాయ ధర్మాదాయ శాఖ బదిలీ చేసింది. యాదగిరిగుట్ట కొత్త ఆలయ ఈవోగా భాస్కర్ రావుని గురువారం నియమించింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టను సందర్శించారు. అయితే ఈ సమయంలో సీఎంకు, మంత్రులకు వేద బ్రాహ్మణులు వేద ఆశీర్వచనం చేశారు. ఈ సమయంలో సీఎం, మిగతా మంత్రుల కంటే... డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖలకు చిన్నపీఠలు వేశారు. ఈ విషయంపై వివాదం రాజుకుంది. భట్టికి, కొండా సురేఖకు అవమానం జరిగిందంటూ ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ అంశంపై మల్లు భట్టి విక్రమార్క స్పందించి తానే కావాలని చిన్న పీఠపై కూర్చున్నానని తెలిపారు.నష్ట నివారణ చర్యల్లో భాగంగా దేవాదాయ ధర్మదాయ శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఆలయ ఈవో రామకృష్ణరావుపై బదిలీ వేటు వేసింది. ఆయన స్థానంలో భాస్కర్‌రావుని ఆలయ ఈవోగా ప్రభుత్వం నియమిస్తూ జీవో జారీ చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి