Weather: నేడు, రేపు వర్షాలు..
ABN , Publish Date - Sep 21 , 2024 | 04:19 AM
ఉత్తర అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావంతో వాయవ్య, పరిసర మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 23న అల్పపీడనం ఏర్పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
23న అల్పపీడనం ఏర్పడే అవకాశం
హైదరాబాద్, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఉత్తర అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావంతో వాయవ్య, పరిసర మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 23న అల్పపీడనం ఏర్పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం మరో ఆవర్తనం పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపింది.
దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ రెండ్రోజులు రాష్ట్రానికి యెల్లో అలెర్ట్ జారీ చేసింది. శనివారం జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, నారాయణపేట్, వనపర్తి, నాగర్‌కర్నూల్, నల్గొండ, ములుగు, ఖమ్మం జిల్లాల్లో ఒకట్రెండుచోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.