Share News

Harsha Sai: పెళ్లి పేరుతో మోసం.. యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదు..

ABN , Publish Date - Sep 24 , 2024 | 07:34 PM

Youtuber Harsha Sai: ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హర్ష సాయిపై కేసు పెట్టారు.

Harsha Sai: పెళ్లి పేరుతో మోసం.. యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదు..
Harsha Sai

హైదరాబాద్, సెప్టెంబర్ 24: ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హర్ష సాయిపై కేసు పెట్టారు. పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ హర్షసాయిపై యువతి ఫిర్యాదు చేసింది. అడ్వకేట్‌తో కలిసి నార్సింగ్ పీఎస్‌కి వచ్చి మరీ ఫిర్యాదు చేసింది యువతి. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన వద్ద నుంచి రూ. 2 కోట్లు తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. హర్ష సాయితో పాటు ఆయన తండ్రి రాధాకృష్ణపై కూడా కేసు నమోదు చేశారు. బాధిత యువతి హర్ష సాయితో కలిసి ఓ సినిమా కూడా నిర్మించినట్లు సమాచారం. ఆమెకు సొంత ప్రొడక్షన్ కూడా ఉంది. శ్రీ పిక్చర్స్ బ్యానర్‌లో హర్షసాయి హీరోగా మెగా అనే మూవీని బాధితురాలు నిర్మించారట. బాధిత యువతి.. బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్‌గా చేశారు.

Updated Date - Sep 24 , 2024 | 08:00 PM