Nalgonda: ఇష్టం లేని పెళ్లి నిశ్చయం.. యువకుడి బలవన్మరణం
ABN , Publish Date - Dec 02 , 2024 | 04:46 AM
ఇంట్లో వాళ్లు కుదిర్చిన పెళ్లి ఇష్టంలేక ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం గోపలాయపల్లిలో శనివారం జరిగింది.
నార్కట్‌పల్లి, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఇంట్లో వాళ్లు కుదిర్చిన పెళ్లి ఇష్టంలేక ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం గోపలాయపల్లిలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన కామసాని గోపాల్‌రెడ్డి, సైదమ్మ దంపతుల మూడో కుమారుడెన వేణగోపాల్‌రెడ్డి(29) ఐటీఐ చదివాడు. వేణు కొన్ని మాసాలుగా దక్షిణాఫ్రికాలో ఉంటున్న పెద్దన్నతో పాటే ఉంటూ అతని బోర్‌వెల్స్ వ్యాపారంలో సహాయం చేస్తున్నాడు. ఐదు నెలల క్రితం గ్రామానికి తిరిగి వచ్చిన వేణుకు ఇటీవలే ఒడిశాకు చెందిన అమ్మాయితో వివాహం నిశ్చయమైంది.
వేణుకు ఈ పెళ్లి ఇష్టం లేక శనివారం రాత్రి 9 గంటల సమయంలో గ్రామంలోని రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లి రెండో సోదరుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి వాయిస్ మెసేజ్ పంపాడు. ప్రవీణ్... వెంటనే గ్రామంలో ఉన్న తన స్నేహితులకు సమాచారమిచ్చాడు. వారు అక్కడికి వెళ్లి చూసేసరికే దురంతో ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి వేణుగోపాల్‌రెడ్డి చనిపోయినట్లు గుర్తించారు.