Share News

Shilparamam: సంప్రదాయ కళా సౌరభం... నవతరం నీరాజనం

ABN , Publish Date - Nov 23 , 2024 | 04:43 AM

ఫేస్‌బుక్‌లు, యూట్యూబ్‌ వీడియోలే లోకం అనుకునే నేటి యువత.. ఆ కళాకారుల సంప్రదాయ ప్రదర్శనలను ప్రత్యక్షంగా తిలకించి అబ్బురపడ్డారు.

Shilparamam: సంప్రదాయ కళా సౌరభం...  నవతరం నీరాజనం

  • లోకమంథన్‌ రెండవ రోజు ఉప్పొంగిన యువోత్సాహం

  • విద్యార్థులతో కళకళలాడిన ప్రాంగణాలు

  • వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు

  • వారి ప్రదర్శనలకు అచ్చెరువొందిన విద్యార్థిలోకం

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఫేస్‌బుక్‌లు, యూట్యూబ్‌ వీడియోలే లోకం అనుకునే నేటి యువత.. ఆ కళాకారుల సంప్రదాయ ప్రదర్శనలను ప్రత్యక్షంగా తిలకించి అబ్బురపడ్డారు. మాదాపూర్‌లోని శిల్పారామం ప్రాంగణంలో జరుగుతున్న లోకమంథన్‌ రెండవ రోజైన శుక్రవారం ఛత్తీ్‌సగడ్‌, తెలంగాణ, ఏపీ, అసోం, లద్ధాఖ్‌ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారుల ప్రదర్శనలను విద్యార్థులు అమితాసక్తిగా తిలకించారు. నగరంలోని పలు పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు గిరిజన సంప్రదాయాలను తెలుసుకునేందుకు అమితాసక్తి కనబరిచారు. ఎ


లాంటి పరికరాలు ఉపయోగించకుండానే జంతువుల అరుపులు, పక్షుల కిలకిలరావాలను పలికించిన తీరు తనను ఆశ్చర్యపరిచిందని భారత్‌ ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన విద్యార్థిని శ్రీజ చెప్పింది. ఎక్కువ మంది విద్యార్ధులు లోకమంథన్‌లో ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్‌లకంటే ఈ ప్రదర్శనల దగ్గరే ఎక్కువ సమయం గడిపామని చెప్పారు. మన కళారూపాలు భావితరాలకు చేరువ చేయడానికి ఆ కళాకారులకు తగిన ప్రోత్సాహం అందించాల్సి ఉంటుందని, మరుగన పడిపోతున్న కళారూపాలను బ్రతికించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని విద్యార్థులు చెప్పారు.

Updated Date - Nov 23 , 2024 | 04:43 AM